AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుబేర యోగంతో కోట్ల సంపద.. వీరిని ఆపడం కష్టమే!

అతి త్వరలో కొన్ని రాశుల వారికి అద్భుతంగా కలిసి రానుంది. ఆదాయం పెరగడమే కాకుండా వారు కోరుకున్నది జరిగే అవకాశం ఈ సమయంలో వీరికి చాలా ఎక్కువగా ఉంది. అతి త్వరలో కొన్ని గ్రహాల కలయికతో కుబేర యోగం ఏర్పడుతుంది. ఇది ఎవరికి మేలు చేస్తోంది అంటే?

Samatha J
|

Updated on: Oct 15, 2026 | 5:11 PM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అతి త్వరలో గురు గ్రహం సింహ రాశిలోకి సంచారం చేయనుంది. ఇప్పటికీ అదే రాశిలో కేతువు సంచారంలో ఉన్నాడు. దీంతో రెండు గ్రహాల కలయిక జరగనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి కెరీర్ పరంగా కలిసి వస్తుంది. కాగా, ఇది ఎవరికి మేలు చేస్తుందో ఇప్పుడు చూద్దాం.

1 / 5
కుంభ రాశి : ఈ రాశి వారికి కుబేర యోగం వల్ల ఆర్థికంగా పెద్ద మార్పు రానుంది. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది. వ్యాపారం చేసే వారికి కొత్త పెట్టుబడులు  వలన ఎక్కువల లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెంపు యోగం ఉంది. పాత అప్పులు తీరిపోతాయి. చాలా ఆనందంగా జీవిస్తారు

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది. అనుకోని విధంగా వీరికి కలిసి వస్తుంది. అంతే కాకుండా గురు, కేతువుల కలయిక వలన వీరికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే కొత్త ఇంటి నిర్మాణం చేపట్టాలి అనుకుంటున్నారో వారికి ఇది మంచి సమయంగా చెప్పాలి.

3 / 5
మేష రాశి : మేష రాశి వారికి ఈ కుబేర యోగం కెరీర్ లో దూసుకుపోయేలా చేస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇదే సరైన సమయం. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికంగా ఎదుగుతారు, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి.

4 / 5
ధనస్సు రాశి :ధనస్సు రాశికి అధిపతి గురుడే కావడంతో ఈ యోగం వీరికి డబుల్ లాభాన్ని ఇస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. షేర్ మార్కెట్, పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. అన్ని విధాలుగా వీరికి ఇది కలిసి వచ్చే సమయంగా చెప్పాలి

5 / 5
Follow Us