IND vs SL: కెప్టెన్‌గా ప్రమోషన్.. ఆ వెంటనే బిగ్ షాకిచ్చిన గంభీర్.. డేంజర్‌లో సూర్య ఫ్యూచర్‌?

India vs Sri Lanka: శ్రీలంక టూర్‌కు టీమిండియాను ప్రకటించిన వెంటనే భారత అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ జట్టులో హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్సీని కూడా చేజార్చుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ ఔట్ అయ్యారు. ఇది మాత్రమే కాకుండా, సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 కెప్టెన్‌గా నియమించారు. కానీ, ఈ ఆటగాడికి కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ కూడా భారీ షాక్ ఇచ్చింది.

IND vs SL: కెప్టెన్‌గా ప్రమోషన్.. ఆ వెంటనే బిగ్ షాకిచ్చిన గంభీర్.. డేంజర్‌లో సూర్య ఫ్యూచర్‌?
Suryakumar Yadav
Follow us

|

Updated on: Jul 19, 2024 | 4:45 PM

India vs Sri Lanka: శ్రీలంక టూర్‌కు టీమిండియాను ప్రకటించిన వెంటనే భారత అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ జట్టులో హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్సీని కూడా చేజార్చుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ ఔట్ అయ్యారు. ఇది మాత్రమే కాకుండా, సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 కెప్టెన్‌గా నియమించారు. కానీ, ఈ ఆటగాడికి కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ కూడా భారీ షాక్ ఇచ్చింది. వాస్తవానికి, సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 జట్టుకు కెప్టెన్‌గా నియమించారు. అయితే అతను వన్డే జట్టు నుంచి తొలగించబడ్డాడు. సూర్యకుమార్ యాదవ్ ODI ప్రపంచ కప్ 2023 కోసం జట్టులో చోటు సంపాదించాడు. కానీ, పేలవమైన ప్రదర్శన తర్వాత, అతను ఈ ఫార్మాట్‌లో జట్టు నుంచి తొలగించబడ్డాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సూర్యకుమార్ యాదల్ స్థానంలో రియాన్ పరాగ్ వన్డే జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. ఈ ఆటగాడు టీ20 జట్టులోకి కూడా ఎంపికయ్యాడు. ప్రశ్న ఏమిటంటే, గౌతమ్ గంభీర్, సెలెక్టర్లు రియాన్ పరాగ్‌పై ఎందుకు అంత దయ చూపారు?

రియాన్ పరాగ్ ప్రత్యేకత..

రియాన్ పరాగ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తో పాటు మంచి ఆల్ రౌండర్ కావడంతో వన్డే, టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. భారీ సిక్సర్లు కొట్టడమే కాకుండా, రియాన్ పరాగ్ స్ట్రైక్ రొటేట్ చేయగలడు. అవసరమైనప్పుడు ఆఫ్ స్పిన్ చేయగలడు. అవసరమైనప్పుడు బౌలింగ్ చేయగల బ్యాట్స్‌మెన్ కోసం టీమ్ ఇండియా చాలా కాలంగా వెతుకుతోంది. రియాన్ పరాగ్ ఈ స్లాట్‌కి సరిపోతాడు.

రియాన్ పరాగ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు..

ఐపీఎల్ 2024 రియాన్ పరాగ్‌కు చాలా బాగుంది. ఈ 22 ఏళ్ల ఆల్ రౌండర్ రాజస్థాన్ తరపున 16 మ్యాచ్‌లు ఆడి 14 ఇన్నింగ్స్‌ల్లో 573 పరుగులు చేశాడు. రాజస్థాన్ తరపున అత్యధిక పరుగులు చేశాడు. అతని అద్భుతమైన ఫామ్‌తో జింబాబ్వే సిరీస్‌లో అవకాశం వచ్చినా అక్కడ మెప్పించలేకపోయాడు. అయితే, ఈ ఆటగాడిపై సెలక్టర్లు మరింత విశ్వాసాన్ని ప్రదర్శించారు.

రియాన్ పరాగ్ కెరీర్..

22 ఏళ్ల పరాగ్ దేశవాళీ క్రికెట్‌లోనూ మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ ఆటగాడు 49 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో మొత్తం 50 వికెట్లు తీశాడు. సయ్యద్ ముస్తాక్ లేదా విజయ్ హజారే ట్రోఫీ అయినా, రియాన్ పరాగ్ రెండు టోర్నమెంట్లలో 500 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. పరాగ్‌కు సత్తా ఉందని, అతని ఫామ్ కూడా బాగుందని చూపించాడు. శ్రీలంకలో అవకాశం లభించి రాణిస్తే ఈ ఆటగాడి అదృష్టాన్ని చాటుకోవచ్చు.

మరన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..