Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021: భారత్ పరాజయాలకు కారణాలు విశ్లేషించిన సునీల్ గవాస్కర్.. అవి ఏమిటంటే..

బయో-బబుల్, బబుల్ ఫెటీగ్ కారణంగా విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమ్ ఇండియా ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2021లో రాణించలేకపోయిందని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. యూఏఈలో జరిగే టీ20 ప్రపంచ కప్ 2021లో టీమ్ ఇండియా ఫేవరెట్‌గా వచ్చిందనే వాస్తవాన్ని కాదనలేమన్నారు...

T20 World Cup 2021: భారత్ పరాజయాలకు కారణాలు విశ్లేషించిన సునీల్ గవాస్కర్.. అవి ఏమిటంటే..
Sg
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 08, 2021 | 6:53 PM

బయో-బబుల్, బబుల్ ఫెటీగ్ కారణంగా విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు టీ20 ప్రపంచ కప్ 2021లో రాణించలేకపోయిందని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఈ మెగా టోర్నిలో టీమ్ ఇండియా ఫేవరెట్‌గా వచ్చిందనే వాస్తవాన్ని కాదనలేమన్నారు. కానీ కోహ్లి అండ్ కో ఇప్పుడు నాకౌట్ దశకు చేరుకోవడంలో విఫలమైందని చెప్పారు. ” కొంతమంది భారతీయ ఆటగాళ్లు ఐపీఎల్ యొక్క చివరి కొన్ని మ్యాచ్‌లు ఆడకుండా ఉండగలరా? భారతదేశం కోసం తమను తాము తాజాగా ఉంచుకోగలరా? సరే, అది వారు సమాధానం చెప్పగల విషయం. ప్రత్యేకించి మీరు అర్హత సాధించలేరని మీకు తెలిసినప్పుడు, కొంతమంది ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుని, వారు బ్యాటరీలను ఫ్రెష్ అప్ చేసుకోవడానికి ఒక వారం, 10 రోజుల విరామం ఇవ్వాలా?” అని గవాస్కర్ అన్నారు.

టాస్ ఓడిపోవడం ఇండియా ఓడిపోలేదని పాకిస్తాన్, న్యూజిలాండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం వల్ల భారత బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారని తెలిపాడు. ‘టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌ల్లో పాక్, కివీస్ బౌలర్లు చాలా తెలివిగా బౌలింగ్ చేశారని చెప్పాడు. అందుకే, భారత బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారన్నారు. అయితే, అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా బ్యాటర్లు బాగా పుంజుకున్నారని చెప్పుకొచ్చారు. టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా అంచనాలను అందుకోలేకపోయింది. గ్రూప్-2లో మూడో స్థానంలో నిలిచింది.

టీం ఇండియా పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలవగా.. కివీస్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడింది. ప్రపంచకప్‌ అనంతరం టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించిన కోహ్లీకి.. పొట్టి క్రికెట్లో సారథిగా ఇదే చివరి మ్యాచ్‌ కానుండగా కోచ్‌గా రవిశాస్త్రికి కూడా ఇదే ఆఖరి మ్యాచ్‌. నిరాశలో ఉన్న భారత జట్టు.. ఆదివారం ప్రాక్టీస్‌ సెషన్‌ను రద్దు చేసుకుంది. ఇండియా 2012 టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఐసీసీ టోర్నమెంట్‎లో నాకౌట్‎కు చేరుకోకపోవడం ఇదే మొదటిసారి.

Read Also..

Cricket: 24 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‎లో పర్యటించనున్న ఆస్ట్రేలియా.. 1998లో చివరి పర్యటన..