T20 World Cup 2021: పాకిస్తాన్‎కు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చిన వసీం జాఫర్.. 12-1లో అర్థం ఏమిటంటే..

టీ20 ప్రపంచకప్ 2021 నుంచి భారత్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. దీనిపై క్రికెట్ పాకిస్తాన్ ట్విట్టర్‎లో ఒక పోస్ట్ చేసింది. 'భారత అభిమానులారా, మీకు ఎలా అనిపిస్తుంది?' అని ట్వీట్ చేసింది. ట్వీట్‎కు భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చాడు...

T20 World Cup 2021: పాకిస్తాన్‎కు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చిన వసీం జాఫర్.. 12-1లో అర్థం ఏమిటంటే..
Jaffer
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 08, 2021 | 7:52 PM

టీ20 ప్రపంచకప్ 2021 నుంచి భారత్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. దీనిపై క్రికెట్ పాకిస్తాన్ ట్విట్టర్‎లో ఒక పోస్ట్ చేసింది. ‘భారత అభిమానులారా, మీకు ఎలా అనిపిస్తుంది?’ అని ట్వీట్ చేసింది. ట్వీట్‎కు భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చాడు. మధ్యాహ్నం 12-1 మధ్య లంచ్ చేశాను.. ఇంకా ఫుల్‎గానే ఉన్నట్లు అనిపిస్తుందని సెటైర్ వేశాడు. అయితే ఈ ట్వీట్‎కు అర్థం చాలా మందికి తెలియలేదు. 12-1 మధ్య అంటే ఐసీసీ టీ20, వన్డే వరల్డ్ కప్‎ల్లో ఇండియా, పాక్ 13 సార్లు తలపడగా అందులో 12 సార్లు భారత్, ఒక్కసారి పాక్ విజయం సాధించింది.

ఈ ఐసీసీ మెగా టోర్నిలో భారత్ విఫలమైంది. సెమీస్‎కు వెళ్లకుండానే ఇంటి ముఖం పట్టింది. ఇండియా 2012 టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఐసీసీ టోర్నమెంట్‎లో నాకౌట్‎కు చేరుకోకపోవడం ఇదే మొదటిసారి. భారత్ తన మొదటి మ్యాచ్‎లో పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‎లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేసినా గెలుపొందలేకపోయింది. రెండో మ్యాచ్‎లో న్యూజిలాండ్ చేతిలో కూడా ఇండియా పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‎లో భారత్ 110 పరుగులు మాత్రమే చేసింది. దీంతో కివీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తర్వాత పుంజుకుని ఆఫ్ఘానిస్తాన్, స్కాట్లాండ్‎ను చిత్తు చేసింది.

Read Also… T20 World Cup 2021: భారత్ పరాజయాలకు కారణాలు విశ్లేషించిన సునీల్ గవాస్కర్.. అవి ఏమిటంటే..