Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: 24 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‎లో పర్యటించనున్న ఆస్ట్రేలియా.. 1998లో చివరి పర్యటన..

వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పాకిస్తాన్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక ట్వంటీ-20 మ్యాచ్ ఆడుతుందని పాక్ క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది...

Cricket: 24 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‎లో పర్యటించనున్న ఆస్ట్రేలియా.. 1998లో చివరి పర్యటన..
Asis
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 08, 2021 | 5:30 PM

వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పాకిస్తాన్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక ట్వంటీ-20 మ్యాచ్ ఆడుతుందని పాక్ క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. ఆసీస్ 1998లో చివరిసారిగా పాకిస్తాన్‎లో పర్యటించింది. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల అనేక సార్లు పాక్‌ పర్యటను ఆస్ట్రేలియా రద్దు చేసుకుంది. 2002 పాకిస్తాన్‌లో పర్యటించాల్సిన ఆసీస్.. కరాచీలో ఆత్మాహుతి బాంబు దాడి జరగడంతో ఆ పర్యటను రద్దు చేసుకుంది. 2008లో పాకిస్తాన్‌లో సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన హింసాత్మకమైన ఘటనల నేపథ్యంలో ఆస్ట్రేలియా తన పర్యటను మరోసారి రద్దు చేసుకుంది. 24 ఏళ్ల తర్వాత ఇప్పుడు పాకిస్థాన్‌కు రాబోతోంది.

పాకిస్తాన్‎​లో భద్రతా సమస్యల కారణంగా అగ్రదేశాలు ఆ దేశంలో టోర్నీలు ఆడేందుకు ఆసక్తి చూపలేదు. 2009లో లాహోర్‌లో శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరగడంతో.. ఏ జట్టు కూడా పాకిస్తాన్‌లో పర్యటించడానికి సాహసం చేయలేదు. కొంతకాలంగా అక్కడి పరిస్థితులు మారటంతో శ్రీలంక, జింబాబ్వే, దక్షిణాఫ్రికా.. పాక్‎​లో పర్యటించాయి. ఆ తర్వాత పాకిస్థాన్ సూపర్ లీగ్ కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా జరగడం వల్ల ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లాంటి జట్లు పాకిస్తాన్‎​లో ఆడేందుకు ముందుకు వచ్చాయి. పాక్​ పర్యటనకు వెళ్లి కొద్ది నిమిషాల్లో టాస్ పడుతుందనగా.. ఈ పర్యటన నుంచి వైదొలిగి పీసీబీకి గట్టి షాకిచ్చింది కివీస్. ఆ తర్వాత ఇంగ్లాండ్ కూడా తమ పాక్ పర్యటనను రద్దు చేసుకుంది.

“మేము మూడు టెస్టుల సిరీస్‌ అంతులేని సంతోషాన్ని కలిగించింది” అని పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా అన్నారు. “అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే జట్లలో ఆస్ట్రేలియా ఒకటి, 24 సంవత్సరాల విరామం తర్వాత వారు మా దేశంలో మొదటిసారి ఆడటం అభిమానులకు ప్రత్యేక ట్రీట్ అవుతుంది. అలాగే, ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఇది గొప్ప అవకాశం అని చెప్పాడు.

పాకిస్తాన్, ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ షెడ్యూల్

  • మొదటి టెస్ట్ మ్యాచ్ మార్చి 3న కరాచీలో ప్రారంభం అవుతుంది.
  • రెండో టెస్ట్ మార్చి 12న రావల్పిండి.
  • మూడో టెస్ట్ మార్చి 21 నుండి లాహోర్‌లో జరుగుతుంది.

పాకిస్తాన్, ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్ షెడ్యూల్

  • మార్చి 29న మొదటి వన్డే
  • మార్చి 31న రెండో వన్డే.
  • ఏప్రిల్ 2 న మూడో వన్డే జరగనుంది.

ఏకైక ట్వంటీ 20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఏప్రిల్ 5న లాహోర్‌లో జరుగుతుంది.

Read Also.. T20 World Cup: ఇండియా ఓటమికి పేలవ ప్రదర్శనే కారణం.. టాస్ కాదు.. తేల్చిచెప్పిన హర్భజన్..