11 మందిలో ఐరెన్ లెగ్ అతడే.. జీరోలతో విలన్‌గా మారాడు.. పీకేస్తే దరిద్రం పోతది..!
Sunil Gavaskar Comments on Team India: ప్రస్తుతం ఇంగ్లాండ్ చేతిలో సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడ్డ భారత్, మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఖచ్చితంగా గెలిస్తేనే సిరీస్‌ను సమం చేయగలదు. ఐపీఎల్ ఘనతలను పక్కనబెట్టి, శ్రేయాస్ అయ్యర్ తన అహాన్ని వీడి ఆటగాళ్లతో కలిసికట్టుగా వ్యూహాలు రచిస్తేనే టీమిండియా మళ్లీ గెలుపు బాట పట్టగలదు. లేదంటే భారత క్రికెట్ చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయంగా మిగిలిపోవడం ఖాయం.

Sunil Gavaskar on Team India: ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత టీ20 జట్టు ప్రస్తుత పరిస్థితి చూసి క్రికెట్ ప్రపంచం విస్తుపోతోంది. వరుస విజయాలతో దూసుకుపోయిన భారత్, ఇప్పుడు వరుస ఓటములతో కుదేలైంది. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో ఘోర పరాజయం అనంతరం, మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నాయకత్వ లోపాలను ఎండగడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
ఐర్లాండ్ నుంచి ఇంగ్లాండ్ దాకా.. పేకమేడలా కూలుతున్న ప్రపంచ ఛాంపియన్..
ఈ ఏడాది ఆరంభంలో టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడి, వరుసగా రెండుసార్లు టైటిల్స్ నెగ్గి చరిత్ర సృష్టించిన భారత జట్టుకు ఉన్నట్టుండి ఏమైందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆటతీరు పూర్తిగా దిగజారిపోయింది. ఎవరూ ఊహించని విధంగా బలహీనమైన ఐర్లాండ్ చేతిలో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను కోల్పోయిన భారత్, ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలోనూ అదే ఫ్లాప్ షోను కొనసాగిస్తోంది. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి మూడు టీ20ల్లో ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా ఓడిపోయింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దవ్వడంతో సరిపోయింది, లేదంటే అక్కడ కూడా పరాజయం తప్పేది కాదు. ఐపీఎల్ స్టార్ వైభవ్ సూర్యవంశీ వంటి విధ్వంసకర ఆటగాళ్లు జట్టులోకి వచ్చినా, ఫలితం మాత్రం శూన్యంగా మారింది.
ఇది కూడా చదవండి: ఏమిరా శ్రేయాస్.. టీమిండియా హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డు.. పరువు తీసేశావుగా..!
సూర్యకుమార్ ‘హీరో’.. శ్రేయాస్ ‘జీరో’: డ్రెస్సింగ్ రూమ్ రహస్యాలు ఇవేనా?
టీమిండియా వరుస వైఫల్యాలపై సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించారు. గతంలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. సూర్య కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో కేవలం ఎనిమిదింటిలో మాత్రమే భారత్ ఓడింది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత సరికొత్త ఓపెనింగ్ జోడీతోనే సూర్య అద్భుత విజయాలు అందించాడు. కానీ, శ్రేయాస్ అయ్యర్ చేతికి పగ్గాలు వచ్చాక భారత్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా గెలవలేకపోయింది.
దీనికి గల ప్రధాన కారణాన్ని గవాస్కర్ విశ్లేషించారు. ఐపీఎల్‌లో కోల్‌కతా జట్టును విజేతగా నిలిపిన శ్రేయాస్ అయ్యర్ వ్యూహాలు అంతర్జాతీయ వేదికపై అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. “ఐపీఎల్ డ్రెస్సింగ్ రూమ్ వేరు, టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వేరు” అని గవాస్కర్ గుర్తుచేశారు. సూర్యకుమార్ యాదవ్ జట్టులోని ఆటగాళ్లందరితో ఎంతో సరదాగా కలిసిపోతూ, ప్రతి వ్యూహాన్ని మైదానంలోకి వెళ్లేముందు వారితో చర్చించేవాడు. కానీ శ్రేయాస్ అయ్యర్ విషయంలో ఆ సాన్నిహిత్యం, కమ్యూనికేషన్ లోపించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆటగాళ్లతో మాట్లాడకుండా, ఒంటెద్దు పోకడలతో వెళ్లడం వల్లే జట్టు ఈ స్థితికి చేరిందని విమర్శలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: టాస్‌లో హీరో.. మ్యాచ్‌లో జీరో.. టీమిండియా పాలిట విలన్‌లా మారిన శ్రేయాస్ అయ్యర్..!
చేజారుతున్న సిరీస్.. కెప్టెన్‌ను నిలదీసిన గవాస్కర్..
ఇంతటి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత జట్టు కేవలం 76 పరుగులకే ఆలౌట్ కావడం కెప్టెన్సీ వైఫల్యమేనని గవాస్కర్ తెగేసి చెప్పారు. బుమ్రా మినహా ప్రపంచకప్ గెలిచిన జట్టు అంతా ఇదే అయినప్పుడు, ఫలితాలు ఎందుకు ఇలా వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనపై కూడా గవాస్కర్ నిరాశ వ్యక్తం చేశారు. కనీసం ఐదారు ఓవర్ల పాటు క్రీజులో నిలబడినా భారత్‌కు ఈ అవమానం తప్పేదని, కానీ కెప్టెన్ నుంచి ఆటగాళ్లకు సరైన దిశానిర్దేశం లేకపోవడం వల్లే మైదానంలో అంతా అయోమయం నెలకొందని మండిపడ్డారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




