ఇదే విధ్వంసం సామీ.. 4 ఓవర్లలో 2 మెయిడీన్లు.. 3 పరుగులిచ్చి 4 వికెట్లు.. బ్యాటర్లకు చుక్కలు చూపించిన దిగ్గజ బౌలర్..

Road Safety World Series 2022: సనత్ జయసూర్య అద్భుత బౌలింగ్‌తో శ్రీలంక లెజెండ్స్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ T20 2022 ఐదవ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ లెజెండ్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇదే విధ్వంసం సామీ.. 4 ఓవర్లలో 2 మెయిడీన్లు.. 3 పరుగులిచ్చి 4 వికెట్లు.. బ్యాటర్లకు చుక్కలు చూపించిన దిగ్గజ బౌలర్..
Sl L Vs Eng L
Follow us
Venkata Chari

|

Updated on: Sep 14, 2022 | 7:41 AM

Road Safety World Series 2022: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ T20 2022 ఐదవ మ్యాచ్‌లో శ్రీలంక లెజెండ్స్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ లెజెండ్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ లెజెండ్స్ జట్టు 19 ఓవర్లలో కేవలం 78 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ లెజెండ్స్ తరపున ఇయాన్ బెల్ 24 బంతుల్లో 15 పరుగుల అత్యధిక ఇన్నింగ్స్ ఆడాడు. ఇది కాకుండా, మిగిలిన బ్యాట్స్‌మెన్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. సనత్ జయసూర్య శ్రీలంక లెజెండ్స్ తరపున అత్యంత విజయవంతమైన బౌలర్ గా నిలిచాడు.

భయపెట్టిన సనత్ జయసూర్య బౌలింగ్..

శ్రీలంక లెజెండ్స్ తరపున సనత్ జయసూర్య అత్యంత భయంకరమైన బౌలింగ్ చేశాడు. సనత్ జయసూర్య తన 4 ఓవర్లలో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 4 మంది ఇంగ్లండ్ లెజెండ్స్ ఆటగాళ్లకు పెవిలియన్ దారి చూపించాడు. అలాగే సనత్ జయసూర్య 2 ఓవర్లలో మెయిడిన్లు వేశాడు. ఇది కాకుండా నువాన్ కులశేఖర, చమర డి సిల్వా తతో 2 వికెట్లు పడగొట్టారు. ఇషారు ఉదానా, జీవన్ మెండిస్ తలో వికెట్ తీశారు. సనత్ జయసూర్య సారథ్యంలోని శ్రీలంక లెజెండ్స్ బౌలర్ల ముందు ఇంగ్లండ్ లెజెండ్స్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో, ఇంగ్లాండ్ లెజెండ్స్ 19 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది.

ఇవి కూడా చదవండి

శ్రీలంక లెజెండ్స్ విజయం..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ లెజెండ్స్ జట్టు 19 ఓవర్లలో 78 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో శ్రీలంక లెజెండ్స్ 20 ఓవర్లలో 79 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది. ఇంగ్లండ్ లెజెండ్స్ 78 పరుగులకు సమాధానంగా, శ్రీలంక లెజెండ్స్ 14.3 ఓవర్లలో 3 వికెట్లకు 79 పరుగులు చేసి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. శ్రీలంక లెజెండ్స్ తరపున దిల్షాన్ మునవీర 43 బంతుల్లో 24 పరుగులు చేయగా, కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్ 21 బంతుల్లో 15 పరుగులు చేశాడు. ఇది కాకుండా ఉపుల్ తరంగ 19 బంతుల్లో 23 పరుగులు చేశాడు. అదే సమయంలో జీవన్ మెండిస్ 4 బంతుల్లో 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ లెజెండ్స్ తరపున స్టీఫెన్ ప్యారీ, క్రిస్ స్కోఫీల్డ్, డిమిత్రి మస్కరెన్‌హాస్ తలో వికెట్ తీశారు.