టీమిండియా హెడ్ కోచ్‌గా..! మనసులో మాట బయటపెట్టిన సౌరవ్ గంగూలీ
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, 2027 తర్వాత జట్టుకు హెడ్ కోచ్‌గా పనిచేయడానికి ఆసక్తి చూపించారు. ప్రస్తుతం బీసీసీఐలో పలు బాధ్యతలు నిర్వహిస్తున్న గంగూలీ, క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తర్వాత పాలన వైపు మళ్ళారు. అయితే, హెడ్ కోచ్ పదవికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు.

టీమిండియా మాజీ క్రికెటర్, భారత క్రికెట్ తలరాతను మార్చిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ గురించి క్రికెట్ అభిమానులుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గాడ్ ఆఫ్ ఆఫ్‌సైడ్‌గా, ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతాగా, బెంగాల్ టైగర్‌గా.. అన్నింటికి మించి దాదా అంటూ అతన్ని అభిమానించే వారు కోట్ల మంది ఉన్నారు. ఇండియాకు ఎదురుతిరగడం అంటే ఏంటో, విదేశాల్లో గెలుపంటే ఏంటో నేర్పించిన నాయకుడు.. 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టును నిర్మించిన కెప్టెన్ అతనే. అందుకే భారత క్రికెట్ చరిత్రలో గంగూలీ కంటే ముందు గంగూలీ తర్వాత అని చెబుతుంటారు చాలా మంది.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత దాదా.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసి.. భారత క్రికెట్‌కు తన సేవల అందించాడు. అలాగే ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మెంటర్‌గా కూడా పనిచేశాడు. అయితే.. తాజాగా దాదా ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అది కూడా టీమిండియా హెడ్ కోచ్ పదవి గురించి. ఓ ఇంటర్వ్యూలో భారత హెడ్ కోచ్‌గా పనిచేసేందుకు ఎప్పుడైనా ఆసక్తి చూపించారా అని ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.. ఎందుకంటే.. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత నేను పాలన వైపు వెళ్లాడు.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ ప్రెసిండెంట్‌గా చేశాను.
అయితే.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం అని చెప్పాడు. అయితే మీరు భారత్ హెడ్ పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారా? అని అడిగితే.. ఎస్.. నాకు ఇంకా 50 ఏళ్లు మాత్రమే.. అవకాశం వస్తే హెడ్ కోచ్‌గా పనిచేయడానికి ఓపెన్‌గానే ఉన్నాను అని తన మనసులో మాట చెప్పేశాడు. కెప్టెన్‌గా టీమిండియాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లిన గంగూలీ.. ఇక హెడ్ కోచ్ అయితే మరో కొత్త టీమిండియాను చూడొచ్చు అని క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవీ కాలం 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఉంది. మరి ఆ తర్వాత సౌరవ్ గంగూలీ టీమిండియాకు హెడ్ కోచ్‌గా వస్తాడేమో చూడాలి.
VIDEO | Veteran cricketer Sourav Ganguly (@SGanguly99), when asked whether he could have contributed more to Indian cricket by coaching the national team, said:
“I never really thought about it (coaching the Indian team) because I got into different roles. I finished in 2013 and… pic.twitter.com/Z0LRaNXd3q
— Press Trust of India (@PTI_News) June 22, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




