AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: లైవ్ మ్యాచ్‌లో కలకలం.. పాము ఎంట్రీతో షాకైన ప్లేయర్లు.. ఆగిన మ్యాచ్.. వైరల్ వీడియో

LPL 2023: లంక ప్రీమియర్ లీగ్ 2వ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక పాము మైదానంలోకి ప్రవేశించింది. కొలంబో ఆర్. ప్రేమదాస మైదానంలో గాలె టైటాన్స్‌తో దంబుల్లా ఓర్రా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ 4వ ఓవర్ సమయంలో మైదానంలో పాము కనిపించడంతో మ్యాచ్ కొంత సేపు నిలిచిపోయింది. ఈ సమయంలో మైదానంలోకి వచ్చిన ఫోర్త్ అంపైర్ పామును బయటకు పంపించాడు.

Video: లైవ్ మ్యాచ్‌లో కలకలం.. పాము ఎంట్రీతో షాకైన ప్లేయర్లు.. ఆగిన మ్యాచ్.. వైరల్ వీడియో
Snake On The Lpl Field
Ranjith Muppidi
| Edited By: Venkata Chari|

Updated on: Jul 31, 2023 | 10:54 PM

Share

LPL 2023: లంక ప్రీమియర్ లీగ్ 2వ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక పాము మైదానంలోకి ప్రవేశించింది. కొలంబో ఆర్. ప్రేమదాస మైదానంలో గాలె టైటాన్స్‌తో దంబుల్లా ఓర్రా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ 4వ ఓవర్ సమయంలో మైదానంలో పాము కనిపించడంతో మ్యాచ్ కొంత సేపు నిలిచిపోయింది. ఈ సమయంలో మైదానంలోకి వచ్చిన ఫోర్త్ అంపైర్ పామును బయటకు పంపించాడు. ప్రస్తుతం ఈ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పామును తరిమికొట్టిన ఫోర్త్ అంపైర్..

మైదానంలో పాము ఎంట్రీ ఇవ్వడంతో ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. అందరూ దూరం నుంచి పామును చూస్తున్నారు. కానీ, దగ్గరికి వెళ్ళడానికి ఎవరూ సాహసించలేదు. ఇలాంటి పరిస్థితిలో ఫోర్త్ అంపైర్ ముందుకు వచ్చాడు. అతను పామును మైదానం నుంచి నుంచి పంపించాడు. పాము మైదానం వెలుపలికి వెళ్లిన తర్వాత మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించారు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ ముగిసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇవి కూడా చదవండి

సూపర్ ఓవర్‌లో గాలె విజయం..

గాలె, దంబుల్లా మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన గాలె 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. భానుక రాజపక్సే 48 పరుగులు చేయగా, కెప్టెన్ దసున్ షనక 42 పరుగులు చేశాడు. 21 బంతుల్లో షనక 4 సిక్సర్లు బాదాడు. అనంతరం దంబుల్లా ఓర్రా కూడా 180 పరుగులు చేసింది. బౌలింగ్‌లో షనక కూడా ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు. అనంతరం మ్యాచ్ సూపర్ ఓవర్ కు చేరుకుంది. కుషన్ రజితపై దంబుల్లా కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. భానుక రాజపక్సే రెండు బంతుల్లో 10 పరుగులు చేసి గాలెకు టోర్నీలో తొలి విజయాన్ని అందించారు.

View this post on Instagram

A post shared by FanCode (@fancode)

భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ సందర్భంగా..

గతంలో గౌహతిలోని బర్స్పరా స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ సందర్భంగా పాము కనిపించింది. ఆ తర్వాత పాములు స్టేడియంలోకి రాకుండా ప్రత్యేక పురుగుల మందులు పిచికారీ చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..