Telugu News Sports News Cricket news Smriti Madhana WPL 2023 Auction: Mumbai Indians buys the Indian Captain for the auction price of 1.80 Crore Rupees
Harmanpreet Kaur: వేలంలో మహిళా జట్టు కెప్టెన్‌ను కూడా సొంతం చేసుకున్న ‘ముంబై’.. హర్మన్ప్రీత్ కోసం ఎంత ఖర్చు చేశారంటే..?
ముంబై వేదికగా జరుగుతున్న ఈ వేలంలో మొత్తం 409 మంది మహిళా క్రికెటర్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్న నేపథ్యంలో.. భారత్ మహిళా జట్టు కెప్టెన్..
ఎంతో కాలంగా ప్రంపచ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) వేలం మొదలైంది. ముంబై వేదికగా జరుగుతున్న ఈ వేలంలో మొత్తం 409 మంది మహిళా క్రికెటర్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్న నేపథ్యంలో.. భారత్ మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ను ముంబై ఇండియన్స్ టీమ్ ఒక కోటీ 80 లక్షల రూపాయలకు దక్కించుకుంది. 2016 నుంచి భారత మహిళా జట్టుకు నాయకత్వం వహిస్తున్న హర్మన్ ప్రీత్ కౌర్ కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరికీ ముంబై ఇండియన్స్ తమ సొంతం చేసుకుంది.
ఇక 2009లోనే భారత మహిళా జట్టులోకి ఆరంగేట్రం చేసిన ఈ పంజాబీ ప్లేయర్‌కు 147 టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఇంకా ఆమె తన టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 2,694 పరుగులు చేసింది. ఇక ఇందులో ఆమె యావరేజ్ 27.48 గా ఉండడంతో పాటు ఒక సెంచరీ, 9 హాఫ్ సెంచరీలు కూడా ఉండడం విశేషం. అలాగే ఇప్పటి వరకు 134 వన్డే మ్యాచ్‌లు ఆడిన హర్మన్‌ప్రీత్.. అందులో కూడా 5 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలతో మొత్తం 3,322 చేసింది. ఇక వన్డేలలో ఆమె బ్యాటింగ్ యావరేజ్ 38.18.
కేవలం బ్యాటింగ్‌తోనే కాక బౌలింగ్‌లోనూ మంచి రికార్డులనే కలిగి ఉంది ఈ మహిళా టీమ్ ఆల్ రౌండర్. వన్డే క్రికెట్‌లో 45.96 బౌలింగ్ యావరేజ్‌తో మొత్తం 31 వికెట్లను పడగొట్టిన హర్మన్ టీ20లలో కూడా 32 వికెట్లను తీసింది. అందరికీ నమ్మశక్యం కాని విషయమేమంటే వన్డేలలో ఆమె హైస్కోర్ 171(నాటౌట్) .. ఇంకా టీ20లలో 103.