Matthew headen coments : కరోనా సెకండ్ వేవ్‌తో భారత్ పోరాడుతుంటే పాశ్చాత్య మీడియా సంస్థలు ఇండియాను అవమానించడానికి, కించపరిచేలా ప్రచారం చేస్తున్నాయని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యుహెడెన్ ఆరోపించాడు. చైనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన భారత్ తప్పుడు సమాచార యుద్దాన్ని కూడా ఎదుర్కొంటుందన్నారు. ఇలాంటి సంక్షోభంలో ఇండియాకు ప్రపంచ దేశాలు మద్దతు పలకడం గర్వించదగ్గ విషయమన్నాడు. భారతదేశానికి సహాయపడేందుకు తాను ఎప్పుడు సిద్దమని తన మద్దతును ప్రకటించాడు. అంతర్జాతీయ మీడియా చేసిన తప్పులను చూపిస్తు తనదైన శైలిలో నిందించాడు.
ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా భారతదేశం కరోనా సెకండ్ వేవ్‌తో కట్టు మిట్టాడుతుందన్నాడు. భయంకరమైన వైరస్ వ్యాప్తితో పోరాడుతున్నప్పుడు ప్రపంచ మీడియా భారత్‌కి మద్దతు పలకకుండా తన అక్కసును వెల్లగక్కిందన్నాడు. తాను ఒక దశాబ్దం పాటుగా భారతదేశాన్ని సందర్శిస్తున్నానని, దేశమంతటా పర్యటించానని తెలిపాడు. ముఖ్యంగా తమిళనాడు తన ” ఆధ్యాత్మిక గృహంగా “భావిస్తున్నట్లు ప్రకటించాడు. ఇంత వైవిధ్యమైన, విస్తారమైన దేశాన్ని నడిపించే నాయకులపై, ప్రభుత్వ అధికారులపై తనకు ఎప్పుడు గౌరవం ఉంటుందన్నాడు.
తాను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ప్రేమతో, ఆప్యాయతతో పలకరించారని, వారికి ఎల్లప్పుడు రుణపడి ఉంటానని చెప్పాడు. కొన్నేళ్లుగా తాను భారతదేశాన్ని దగ్గరగా చూస్తున్నానని, అందుకే అంతర్జాతీయ మీడియా చేస్తున్న ఆరోపణలకు తన రక్తం మరిగిపోతుందని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా భారతదేశం ఎన్ని సవాళ్లను ఎదుర్కోవడానికైనా సిద్దంగా ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. .