SL vs IND: రాణించిన వాషింగ్టన్ సుందర్.. రెండో వన్డేలో టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ప్రేమదాస స్టేడియంలో టీమిండియా-శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే జరుగుతోంది. రెండో మ్యాచ్‌లో కూడా శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి మ్యాచ్ లాగే ఈ గేమ్ లోనూ భారత బౌలర్లు ఆకట్టుకున్నారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేశారు. అయితే తోకను మాత్రం కత్తిరించలేకపోయారు. ఫలితంగా మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో
ప్రేమదాస స్టేడియంలో టీమిండియా-శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే జరుగుతోంది. రెండో మ్యాచ్‌లో కూడా శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి మ్యాచ్ లాగే ఈ గేమ్ లోనూ భారత బౌలర్లు ఆకట్టుకున్నారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేశారు. అయితే తోకను మాత్రం కత్తిరించలేకపోయారు. ఫలితంగా మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో అత్యధికంగా 40 పరుగులు చేశాడు. దునిత్ వెల్లాగే 39 పరుగులు చేయగా, కమిందు మెండిస్ కూడా 40 పరుగులు చేసి శ్రీలంకకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. టీమ్ ఇండియా తరఫున వాషింగ్టన్ సుందర్. అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు. . కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డే టైగా ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ఈ రెండు వన్డే కీలకంగా మారింది.
#TeamIndia spinners continue to keep things tight with the ball 😎
ఇవి కూడా చదవండిSri Lanka 151/6 in the 39th over
Follow the Match ▶️ https://t.co/KTwPVvTBCB#TeamIndia | #SLvIND pic.twitter.com/T8DteqIMLx
— BCCI (@BCCI) August 4, 2024
రెండు జట్లు
శ్రీలంక:
పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక (కెప్టెన్), కమిందు మెండిస్, జనిత్ లియానాగే, దునిత్ వెలలాగే, అకిలా ధనంజయ్, అసిత్ ఫెర్నాండో, జెఫ్రీ వాండర్సే.
భారత్:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..