AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shubman Gill : ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై గిల్ అసంతృప్తి.. రంగంలోకి దిగిన సౌరవ్ గంగూలీ.. పిచ్ ఎలా ఉండబోతోంది?

భారత్, సౌతాఫ్రికా మధ్య నవంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి పోరు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‎లో జరగనుంది. అయితే, ఈ కీలకమైన మ్యాచ్‌కు నాలుగు రోజుల ముందు, భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పిచ్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాక్టీస్ సెషన్ తర్వాత పిచ్‌ను పరిశీలించిన గిల్, అది పొడిగా, గోధుమ రంగులో ఉండటంతో అసంతృప్తి చెందారు.

Shubman Gill : ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై గిల్ అసంతృప్తి.. రంగంలోకి దిగిన సౌరవ్ గంగూలీ.. పిచ్ ఎలా ఉండబోతోంది?
Shubman Gill (2)
Rakesh
|

Updated on: Nov 13, 2025 | 10:04 AM

Share

Shubman Gill : భారత్, సౌతాఫ్రికా మధ్య నవంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి పోరు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‎లో జరగనుంది. అయితే, ఈ కీలకమైన మ్యాచ్‌కు నాలుగు రోజుల ముందు, భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పిచ్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాక్టీస్ సెషన్ తర్వాత పిచ్‌ను పరిశీలించిన గిల్, అది పొడిగా, గోధుమ రంగులో ఉండటంతో అసంతృప్తి చెందారు. దీంతో రంగంలోకి దిగిన క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ కొత్త అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్వయంగా పిచ్‌ను పరిశీలించారు.

టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని కోల్‌కతా చేరుకున్న తర్వాత, మంగళవారం ఈడెన్ గార్డెన్స్‌లో ట్రైనింగ్ సెషన్ నిర్వహించింది. ఈ సెషన్‌కు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్‌తో సహా ఏడుగురు ఆటగాళ్లు మాత్రమే హాజరయ్యారు. సుమారు మూడు గంటల ప్రాక్టీస్ తర్వాత, కోచింగ్ సిబ్బంది పిచ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ పిచ్ పరిశీలించారు. వారి స్పందనను బట్టి, మేనేజ్‌మెంట్ పిచ్‌పై పూర్తిగా సంతృప్తి చెందలేదు అని అర్థమవుతోంది.

గిల్ వెంటనే పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీని పిలిచి సుమారు 15 నిమిషాల పాటు పిచ్ పరిస్థితి గురించి చర్చించారు. ప్రస్తుతం ఈడెన్ గార్డెన్స్ పిచ్ గడిచిన వారం రోజులుగా నీరు పట్టకుండా పొడిగా, గోధుమ రంగులో కనిపిస్తుంది. అక్కడక్కడా కొద్దిపాటి పచ్చిక మాత్రమే ఉంది. సౌతాఫ్రికా జట్టు స్పిన్-హెవీ ప్రాక్టీస్ సెషన్ ముగించుకున్న వెంటనే సౌరవ్ గంగూలీ స్వయంగా పిచ్‌ను పరిశీలించడానికి వచ్చారు. ఆయన కూడా క్యూరేటర్ సుజన్ ముఖర్జీతో మాట్లాడారు.

గంగూలీ మాట్లాడుతూ.. ప్రధాన పిచ్ పొడిగా ఉన్నప్పటికీ, భారత జట్టు తమకు పూర్తిగా రాంక్ టర్నర్ కావాలని కోరలేదని వెల్లడించారు. అంటే, మొదటి రోజు నుంచే బంతి బాగా తిరగాలని టీమిండియా డిమాండ్ చేయలేదని అర్థం. గంగూలీ పరిశీలించిన తర్వాత, గ్రౌండ్ సిబ్బంది ప్రక్కనే ఉన్న స్క్వేర్‌లకు నీరు పట్టారు. ఈడెన్ గార్డెన్స్ గతంలో రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. అక్కడ ఫాస్ట్ బౌలర్లు మొదటి రోజు కొంచెం కష్టపడినా, తర్వాత రివర్స్ స్వింగ్ సహాయంతో వికెట్లు తీశారు. అయితే, పిచ్ పొడిగా ఉంటే అది దక్షిణాఫ్రికా స్పిన్ త్రయానికి అనుకూలించవచ్చు.

సౌతాఫ్రికా జట్టులో పేస్, స్పిన్ బౌలింగ్ రెండూ బలంగా ఉన్నాయి. కగిసో రబాడా, మార్కో జాన్సెన్ వంటి పేసర్లు ఉండగా, వారి స్పిన్ త్రయం చాలా స్ట్రాంగ్ గా ఉంది. గత నెలలో పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌ను సమం చేయడంలో వారి స్పిన్నర్లు సైమన్ హార్మర్ (13 వికెట్లు), సేనురన్ ముత్తుసామి (11), కేశవ్ మహారాజ్ (9) కీలకపాత్ర పోషించారు. వీరు ముగ్గురూ కలిసి మొత్తం 33 వికెట్లు పడగొట్టారు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన ముత్తుసామి బ్యాటింగ్‌లో కూడా 106 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..