AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shubman Gill: అందుకే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది! గిల్ తొలగింపుపై నిజాలు కక్కిన కెప్టెన్

మెల్‌బోర్న్ టెస్టులో శుభ్‌మాన్ గిల్‌ను డ్రాప్ చేయడం అభిమానులకు షాక్ ఇచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. జట్టు ఓటమితో విమర్శలు పెరిగాయి, కానీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కి అర్హత కోసం వచ్చే మ్యాచ్ కీలకం. గిల్ తిరిగి జట్టులోకి వస్తాడా అనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Shubman Gill: అందుకే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది! గిల్ తొలగింపుపై నిజాలు కక్కిన కెప్టెన్
Gill Rohit
Narsimha
|

Updated on: Dec 31, 2024 | 10:14 AM

Share

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్ భారత అభిమానులకు షాక్ ఇచ్చింది. జట్టు కాంబినేషన్‌ను బ్యాలెన్స్ చేయాలన్న ఆలోచనతో శుభ్‌మాన్ గిల్‌ను పక్కన పెట్టి, కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్‌లో అగ్రస్థానానికి తిరిగి వచ్చాడు. గిల్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోలేకపోవడం వెనుక వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు అవసరాలు కీలకమయ్యాయని రోహిత్ స్పష్టం చేశాడు.

మొత్తం మూడు ఇన్నింగ్స్‌లు ఆడిన గిల్ 20 సగటుతో 60 పరుగులు సాధించినప్పటికీ, జట్టు అవసరాల కోసం అతన్ని పక్కన పెట్టారని రోహిత్ పేర్కొన్నాడు. విలేకరులతో మాట్లాడుతూ, “గిల్‌ను డ్రాప్ చేయలేదు; జట్టు కాంబినేషన్ కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాం. 20 వికెట్లు తీసే బౌలింగ్ దళాన్ని సెట్ చేయడమే మా ప్రాధాన్యం” అని తెలిపారు.

కానీ ఈ నిర్ణయం వెనుక రోహిత్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను రెండు వర్గాలుగా చీల్చాయి. మ్యాచ్‌లో భారత జట్టు 184 పరుగుల తేడాతో ఓడిపోవడం జట్టు యాజమాన్యంపై విమర్శలు పెంచింది. ఆసీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాటింగ్ లైనప్ 155 పరుగులకే కుప్పకూలింది. పాట్ కమిన్స్ తన అద్భుతమైన ప్రదర్శనతో మ్యాచ్ వీరుడిగా నిలిచాడు.

తదుపరి మ్యాచ్‌లో భారత్ జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కి అర్హత సాధించాలంటే విజయం అత్యవసరం. ఇదే సమయంలో, గిల్‌ను జట్టులోకి తెచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయనే ప్రశ్న అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.