4వ టెస్టులో 24 ఏళ్ల ప్లేయర్ అరంగేట్రం పక్కా.. కరుణ్ నాయర్, రిషబ్ పంత్, ఆకాష్ దీప్‌పై క్లారిటీ ఇచ్చేసిన గిల్..?
ప్రస్తుతం సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉండగా, సిరీస్‌ను సమం చేయాలంటే టీమిండియా ఈ నాలుగో టెస్ట్‌లో తప్పక గెలవాలి. గాయాల సమస్యలు, కొత్త ఆటగాళ్ల అరంగేట్రంతో నాలుగో టెస్టు మరింత ఆసక్తికరంగా మారనుంది. వర్షం కూడా మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ, ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.

Team India: మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో బుధవారం (జులై 23, 2025) నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్, భారత్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మీడియా సమావేశంలో పలు కీలక విషయాలను వెల్లడించారు. టీమిండియాలో అరంగేట్రం చేయబోయే ఆటగాడిపై, అలాగే గాయపడిన ఆటగాళ్ల పరిస్థితిపై నెలకొన్న సందిగ్ధతను తొలగించారు.
అంశుల్ కాంబోజ్ అరంగేట్రం దాదాపు ఖాయం..
టీమిండియా పేస్ బౌలింగ్ విభాగంలో గాయాల బెడద వెంటాడుతోంది. ఆకాష్ దీప్ గజ్జల్లో గాయం కారణంగా నాలుగో టెస్టుకు దూరమయ్యాడని గిల్ ధృవీకరించాడు. ఆకాష్ దీప్‌తో పాటు ఆర్‌ష్‌దీప్ సింగ్ కూడా చేతి గాయం కారణంగా నాలుగో టెస్టుకు అందుబాటులో లేడు. ఈ నేపథ్యంలో, 24 ఏళ్ల హర్యానా ఫాస్ట్ బౌలర్ అంశుల్ కాంబోజ్ అరంగేట్రం దాదాపు ఖాయమని గిల్ సంకేతాలిచ్చాడు. “అంశుల్ కాంబోజ్ అరంగేట్రానికి చాలా దగ్గరగా ఉన్నాడు. ప్రసిద్ కృష్ణ, అంశుల్ కాంబోజ్‌లలో రేపు ఎవరిని ఎంపిక చేయాలనేది చూద్దాం” అని గిల్ పేర్కొన్నాడు. అంశుల్ కాంబోజ్ నెట్స్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి కోచింగ్ సిబ్బందిని ఆకట్టుకున్నాడని తెలుస్తోంది.
రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ బాధ్యతలు..
మూడో టెస్టులో వేలి గాయం కారణంగా వికెట్ కీపింగ్ బాధ్యతలను ధ్రువ్ జురెల్‌కు అప్పగించిన రిషబ్ పంత్, నాలుగో టెస్టులో వికెట్ కీపింగ్ బాధ్యతలను తిరిగి తీసుకోనున్నాడు. పంత్ పూర్తిగా కోలుకున్నాడని, వికెట్ కీపింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని గిల్ ధృవీకరించాడు. ఇది భారత జట్టుకు పెద్ద ఊరట.
కరుణ్ నాయర్‌కు మద్దతు..
సిరీస్‌లో పెద్దగా పరుగులు చేయలేకపోయిన కరుణ్ నాయర్‌కు శుభ్‌మన్ గిల్ మద్దతుగా నిలిచాడు. నాయర్ ఫామ్‌లోకి వస్తాడని తాను నమ్ముతున్నానని గిల్ చెప్పాడు. “అతను మొదటి మ్యాచ్‌లో తన నంబర్‌లో బ్యాటింగ్ చేయలేదు, మేం అతనితో మాట్లాడాం” అని గిల్ పేర్కొన్నాడు. అంటే కరుణ్ నాయర్‌ను జట్టులో కొనసాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
గాయాల బెడద, జట్టు కూర్పు..
ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా మోకాలి గాయం కారణంగా సిరీస్ నుంచి నిష్క్రమించాడు. దీంతో భారత్ కనీసం రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ఆకాష్ దీప్ స్థానంలో అంశుల్ కాంబోజ్/ప్రసిద్ కృష్ణ, నితీష్ రెడ్డి స్థానంలో మరో ఆల్‌రౌండర్ లేదా అదనపు బ్యాట్స్‌మెన్ ఆడించే అవకాశం ఉంది.
ప్రస్తుతం సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉండగా, సిరీస్‌ను సమం చేయాలంటే టీమిండియా ఈ నాలుగో టెస్ట్‌లో తప్పక గెలవాలి. గాయాల సమస్యలు, కొత్త ఆటగాళ్ల అరంగేట్రంతో నాలుగో టెస్టు మరింత ఆసక్తికరంగా మారనుంది. వర్షం కూడా మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ, ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




