AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: రోహిత్ దోస్తా లేదా గంభీర్ శిష్యుడా.. కోహ్లీ రాకతో కటక్ వన్డే నుంచి తప్పుకునేది ఎవరు?

Shreyas iyer: ఇంగ్లాండ్‌తో జరిగిన నాగ్‌పూర్ వన్డేలో శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించి టీమిండియాను విజయపథంలో నడిపించాడు. అయితే, ఈ విజయం తర్వాత, తాను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండబోనని వెల్లడించాడు. విరాట్ కోహ్లీ ఫిట్‌గా లేకపోవడం వల్ల తనకు ఆ అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చి షాకిచ్చాడు. దీంతో ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే రెండో వన్డేలో ఎవరు తప్పుకుంటారు?

IND vs ENG: రోహిత్ దోస్తా లేదా గంభీర్ శిష్యుడా.. కోహ్లీ రాకతో కటక్ వన్డే నుంచి తప్పుకునేది ఎవరు?
Shreyas Iyer, Yashasvi Jaiswal
Venkata Chari
|

Updated on: Feb 07, 2025 | 2:56 PM

Share

Shreyas iyer: ఇంగ్లాండ్ పై అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించిన తర్వాత, శ్రేయాస్ అయ్యర్ మరో అద్భుతం చేశాడు. విరాట్ కోహ్లీ ఫిట్‌గా లేనందున తాను నాగ్‌పూర్ వన్డే ఆడానని, లేకుంటే అతన్ని ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చరంటూ షాకిచ్చాడు. అయ్యర్‌కు అవకాశం వచ్చింది. ఈ ఆటగాడు 59 పరుగులు చేసి టీం ఇండియాను గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత, అయ్యర్‌ను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి మినహాయించడం దాదాపు అసాధ్యంగా మారింది. అయ్యర్ 4వ స్థానంలో వేగంగా బ్యాటింగ్ చేయడం ద్వారా భారత జట్టును ఓటమి నుంచి తప్పించాడు. మరి గంభీర్, రోహిత్ అతన్ని ఎలా వదిలిపెడతారు? ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే విరాట్ కోహ్లీ ఫిట్‌గా మారినందున ఎవరు ఔట్ అవుతారు. అయ్యర్ ఇన్నింగ్స్ ఎవరిని ఇబ్బంది పెడుతుందో వివరంగా తెలుసుకుందాం..

ఇబ్బందుల్లో యశస్వి జైస్వాల్..

యశస్వి జైస్వాల్‌కు నాగ్‌పూర్ వన్డేలో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఈ ఆటగాడు బాగానే ఆడాడు. కానీ, యశస్వి 22 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. వన్డే జట్టులో ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కించుకోవడానికి చాలా పోటీ ఉన్నందున యశస్వి వైఫల్యం అతనికి సమస్యలను కలిగిస్తుంది. గత మ్యాచ్‌లో గిల్ 87 పరుగులు చేశాడు. అయ్యర్ కూడా 59 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇలాంటి పరిస్థితిలో వారిద్దరినీ తప్పించడం కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు విరాట్ వస్తే, యశస్వి బయట కూర్చోవలసి రావచ్చు. గిల్ మళ్ళీ అతని స్థానంలో ఓపెనింగ్ చేయవచ్చు. విరాట్ మూడవ స్థానంలో, అయ్యర్ నాల్గవ స్థానంలో ఆడతారు. ఇప్పుడు టీం ఇండియా కూడా అదే కాంబినేషన్‌తో ఛాంపియన్స్ ట్రోఫీలో కనిపిస్తుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్..

అయితే, శ్రేయాస్ అయ్యర్ విషయంలో సెలెక్టర్ల ప్రవర్తన చూసి చాలా మంది క్రికెట్ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. ‘కోహ్లీ ఫిట్‌గా ఉన్నప్పుడు అయ్యర్‌కు ఛాన్స్ దక్కకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది’ అని ఆకాష్ చోప్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం ద్వారా తన విచారాన్ని వ్యక్తం చేశాడు. ప్రపంచ కప్‌లో 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి భారతీయ ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. ఒకవేళ అయ్యర్‌ను తప్పించలేకపోతే, విరాట్ కోహ్లీ ఎక్కడ బ్యాటింగ్ చేస్తాడు? పరుగులు చేయడం ద్వారా శ్రేయాస్ అయ్యర్ గంభీర్ మరియు రోహిత్‌లకు స్వీట్ హెడేక్‌గా మారాడని పార్థివ్ పటేల్ అన్నాడు. ఈ క్రమంలో అయ్యర్ కూడా కోహ్లీ ఫిట్‌గా లేకపోవడంతోనే నాకు ఛాన్స్ వచ్చిందంటూ చెప్పడం, మ్యాచ్ ముగిసిన తర్వాత నో బెటర్ ఫీలింగ్ అంటూ ట్వీట్ చేయడంతో, బీసీసీఐ ఎలాంటి ధోరణితో ఉందనే విషయం తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..