AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాడి టార్చర్‌తో పిచ్చెక్కింది.. మాటీంలో ఆ ఒక్కడు తప్ప, అందరూ దరిద్రులే: శ్రేయస్ అయ్యర్..!

Shreyas Iyer Comments: సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశం చేజారినప్పటికీ, తదుపరి మ్యాచ్‌లోనైనా పుంజుకుని సిరీస్‌ను సమం చేస్తామని టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. రాబోయే మ్యాచ్‌లో తప్పులను సరిదిద్దుకుని కచ్చితంగా విజయం సాధిస్తామని అభిమానులకు హామీ ఇచ్చాడు.

వాడి టార్చర్‌తో పిచ్చెక్కింది.. మాటీంలో ఆ ఒక్కడు తప్ప, అందరూ దరిద్రులే: శ్రేయస్ అయ్యర్..!
Ind Vs Eng Shreyas Iyer Comments
Venkata Chari
|

Updated on: Jul 08, 2026 | 8:44 AM

Share

Shreyas Iyer Comments: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడమే కాకుండా, టీ20 చరిత్రలోనే అత్యంత స్వల్ప స్కోర్లలో ఒకటైన 76 పరుగులకే కుప్పకూలింది. ఈ అవమానకర ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చరిత్రలో రెండో అత్యల్ప స్కోరు.. బ్యాటింగ్ దరిద్రానికి నిదర్శనం..!

ఇంగ్లాండ్ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆరంభం నుంచే చేతులెత్తేసింది. వచ్చిన ఆటగాడు వచ్చినట్లే పెవిలియన్‌కు క్యూ కట్టారు. కేవలం 76 పరుగులకే భారత ఇన్నింగ్స్ ముగిసింది. ఇది భారత టీ20 క్రికెట్ చరిత్రలోనే రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. గతంలో ఆస్ట్రేలియాపై నమోదైన 74 పరుగుల అత్యల్ప స్కోరు రికార్డును తృటిలో తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తరపున వైభవ సూర్యవంశీ చేసిన 13 పరుగులే అత్యధిక స్కోరు కావడం మన బ్యాటింగ్ వైఫల్యానికి, దరిద్రానికి అద్దం పడుతోంది. ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో నిలదొక్కుకుని ఆడలేకపోయాడు.

ఇది కూడా చదవండి: టాస్‌లో హీరో.. మ్యాచ్‌లో జీరో.. టీమిండియా పాలిట విలన్‌లా మారిన శ్రేయాస్ అయ్యర్..!

ఇవి కూడా చదవండి

ఇంగ్లాండ్ బ్యాటర్ల విధ్వంసం.. భారీ లక్ష్యం..

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ 70 పరుగులతో భారత బౌలర్లపై విరుచుకుపడగా, జోష్ బట్లర్ 36 పరుగులు, సామ్ కరన్ 41 పరుగులతో రాణించారు. దీంతో ఇంగ్లాండ్ భారత్‌కు కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ మినహా మిగిలిన వారంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

తలదించుకునేలా ఓడిపోయాం: కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆగ్రహం

ఈ దారుణ ఓటమిపై మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అత్యంత నిజాయితీగా, ఆవేదనతో స్పందించాడు. “ఈ మ్యాచ్‌లో మేం బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ ఘోరంగా విఫలమయ్యాం. పిచ్ స్వభావాన్ని బట్టి ఏ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలో మా బౌలర్లు తెలుసుకోలేకపోయారు. ఆ విషయంలో ఇంగ్లాండ్ బౌలర్లు మాకంటే ఎంతో మెరుగ్గా రాణించారు. ముఖ్యంగా ఆర్చర్ మాకు టార్చర్‌లా తయారయ్యాడు. ఇక 200కు పైగా పరుగులను ఛేజ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్‌ను ఎలా నిర్మించాలనే దానిపై మాకు కనీస ప్రణాళిక లేకపోయింది” అని అయ్యర్ ఒప్పుకున్నాడు.

మరింత ఘాటుగా స్పందిస్తూ, “ఇంత పెద్ద తేడాతో ఓడిపోవడం కచ్చితంగా ఆమోదయోగ్యం కాదు. ఇది 200 పరుగులు వచ్చే వికెట్ అని నేను అనుకోవడం లేదు. ప్రిన్స్ యాదవ్ మినహా బౌలర్లంతా భారీగా పరుగులు ఇచ్చారు. పవర్‌ప్లేలోనే నాలుగు నుంచి ఐదు వికెట్లు కోల్పోవడం మా ఓటమిని శాసించింది. చాలా దరిద్రమైన ఆటతీరును కనబరిచాం” అంటూ జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: ఏమిరా శ్రేయాస్.. టీమిండియా హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డు.. పరువు తీసేశావుగా..!

ప్రిన్స్ యాదవ్ ఒక్కడే పోరాడాడు..!

ఈ మ్యాచ్‌లో భారత జట్టులో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసింది బౌలర్ ప్రిన్స్ యాదవ్ మాత్రమే. అతను తన 4 ఓవర్ల కోటాలో కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా క్యాచ్ జారవిడవకుంటే ప్రిన్స్ యాదవ్‌కు మూడో వికెట్ కూడా దక్కేది. జట్టులోని మిగతా 10 మంది ఆటగాళ్లు పూర్తిగా చేతులెత్తేయడంతో అభిమానులు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశం చేజారినప్పటికీ, తదుపరి మ్యాచ్‌లోనైనా పుంజుకుని సిరీస్‌ను సమం చేస్తామని శ్రేయస్ అయ్యర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. రాబోయే మ్యాచ్‌లో తప్పులను సరిదిద్దుకుని కచ్చితంగా విజయం సాధిస్తామని అభిమానులకు హామీ ఇచ్చాడు. అయితే ప్రపంచ స్థాయి జట్టుగా గుర్తింపు ఉన్న భారత్ ఇలా కనీస పోటీ ఇవ్వకుండా 76 పరుగులకే కుప్పకూలడం మాత్రం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us