IPL 2025: సీజన్ కు మందు మరో సంచలన ఒప్పందం.. పట్టాలెక్కనున్న టోరెంట్ గ్రూప్..ఆ జట్టు ఏదో తెలుసా..?
టోరెంట్ గ్రూప్ 2021లోనే IPL ఫ్రాంచైజీ కోసం బిడ్ చేసినా విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు, 67% వాటాను కొనుగోలు చేసి గుజరాత్ టైటాన్స్ కొత్త యజమానిగా మారనుంది. గుజరాత్ టైటాన్స్ 2022లో IPL ట్రోఫీ గెలుచుకుంది, 2023లో ఫైనల్‌కి చేరింది. 2025 సీజన్‌లో శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో GT పోటీకి దిగనుంది. టోరెంట్ గ్రూప్ కొత్త యజమాన్యంతో GT మరింత బలంగా తిరిగి రావొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.

అహ్మదాబాద్‌కు చెందిన టోరెంట్ గ్రూప్, IPL లో ప్రవేశించేందుకు గతంలోనే ప్రయత్నించింది. 2021లో అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కోసం రూ. 4653 కోట్లు, లక్నో ఫ్రాంచైజీ కోసం రూ. 4356 కోట్లు బిడ్ చేసింది. అయితే, విజయాన్ని అందుకోలేకపోయింది.
ఇప్పుడు, IPL లో మరో సంచలన ఒప్పందం చోటుచేసుకుంది. గుజరాత్ టైటాన్స్ (GT) ఫ్రాంచైజీకి కొత్త యజమానిగా టోరెంట్ గ్రూప్ రంగంలోకి దిగుతోంది. ప్రస్తుతం CVC క్యాపిటల్ పార్ట్నర్స్ వద్ద ఉన్న 67% వాటాను టోరెంట్ గ్రూప్ కొనుగోలు చేయనుంది. IPL గవర్నింగ్ కౌన్సిల్ అనుమతి తర్వాత, 2025 సీజన్ నుంచి కొత్త యజమాన్యం అధికారికంగా బాధ్యతలు స్వీకరించనుంది. మార్చి 21న మొదలయ్యే IPL 2025 లో ఈ మార్పు అమలులోకి రావొచ్చు.
గుజరాత్ టైటాన్స్ విజయగాధ
2021లో స్థాపితమైన గుజరాత్ టైటాన్స్, ప్రారంభ సీజన్‌లోనే IPL ట్రోఫీ గెలిచి సంచలనం సృష్టించింది. CVC క్యాపిటల్ పార్ట్నర్స్ ఈ ఫ్రాంచైజీని రూ. 5625 కోట్లకు (సుమారు $750 మిలియన్) కొనుగోలు చేసింది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో 2022లో టైటిల్ గెలిచిన GT, 2023లో ఫైనల్‌కు చేరింది. అయితే, 2024 సీజన్‌లో జట్టు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. పాయింట్స్ టేబుల్‌లో ఎనిమిదవ స్థానంతో సరిపెట్టుకుంది.
కానీ, ఈ వెనుకబాటుతో GT గౌరవం తగ్గిపోలేదు. నరేంద్ర మోదీ స్టేడియం (100,000+ సామర్థ్యం) తమ హోమ్ గ్రౌండ్‌గా ఉండటం, కొత్త యజమానుల ప్రవేశంతో జట్టులో కొత్త ఉత్సాహం వచ్చింది.
టోరెంట్ గ్రూప్ క్రికెట్ ఎంట్రీ
టోరెంట్ గ్రూప్‌కు IPL లో అడుగుపెట్టే ఆసక్తి కొత్తది కాదు. 2021లో IPL ఫ్రాంచైజీ కోసం భారీగా బిడ్లు వేసినా, విజయాన్ని అందుకోలేకపోయింది. అలాగే, 2023 మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లోనూ ఫ్రాంచైజీ పొందేందుకు ప్రయత్నించింది కానీ విజయవంతం కాలేదు.
ఇప్పుడో, గుజరాత్ టైటాన్స్‌ను స్వాధీనం చేసుకోవడం ద్వారా టోరెంట్ గ్రూప్ తన కలను నిజం చేసుకుంది. గ్రూప్ చైర్మన్ ఎమిరిటస్ సుధీర్ మెహతా కుమారుడు జినల్ మెహతా ఈ కొత్త యజమాన్య మార్పుకు నాయకత్వం వహించనున్నారు.
శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో పోటీకి సిద్ధమైన గుజరాత్ టైటాన్స్
IPL 2025లో గుజరాత్ టైటాన్స్ జట్టును టీమిండియా యువ బ్యాటింగ్ స్టార్ శుభ్‌మన్ గిల్ నేతృత్వం వహించనున్నాడు. జట్టులో రషీద్ ఖాన్ (అఫ్గాన్ స్పిన్ మ్యాజీషియన్), జోస్ బట్లర్ (ఇంగ్లాండ్ స్టార్స్), మహమ్మద్ సిరాజ్ (భారత ప్రధాన పేసర్) వంటి స్టార్ ప్లేయర్లు ఉండటంతో, GT మరొక్కసారి IPL ట్రోఫీ కోసం బరిలోకి దిగనుంది.
GT అభిమానులందరూ 2025లో తమ జట్టు తిరిగి విజయం సాధిస్తుందనే ఆశతో ఉన్నారు. టోరెంట్ గ్రూప్ కొత్త యజమాన్యంతో GT మరింత బలమైన జట్టుగా ఎదిగే అవకాశముంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..