ధోనికి నచ్చినప్పుడు రిటైరవుతాడు.. విమర్శకులకు వార్న్ పంచ్!

భారత మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనిని విమర్శించే వారిపై ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఘాటైన పంచ్ ఇచ్చాడు. ప్రపంచకప్ పూర్తి కాగానే ధోని రిటైర్మెంట్ తీసుకుంటాడని.. అతని ఆటతీరు మునపటి మాదిరిలా లేదని కొద్దిరోజులుగా కొంతమంది విమర్శలు చేశారు..కాగా వారిపై వార్న్ స్పందించాడు. భారత్ క్రికెట్‌కు ధోని ఎన్నో సేవలందించాడు. ఓ ఆటగాడి కంటే ఎక్కువగానే ధోని ఇండియన్ జట్టుకు ఎంతో చేశాడు. ధోనీకి అన్నీ తెలుసు. తనకు ఎప్పుడు నచ్చితే అప్పుడే […]

ధోనికి నచ్చినప్పుడు రిటైరవుతాడు.. విమర్శకులకు వార్న్ పంచ్!
Follow us
Ravi Kiran

|

Updated on: May 27, 2019 | 9:59 PM

భారత మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనిని విమర్శించే వారిపై ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఘాటైన పంచ్ ఇచ్చాడు. ప్రపంచకప్ పూర్తి కాగానే ధోని రిటైర్మెంట్ తీసుకుంటాడని.. అతని ఆటతీరు మునపటి మాదిరిలా లేదని కొద్దిరోజులుగా కొంతమంది విమర్శలు చేశారు..కాగా వారిపై వార్న్ స్పందించాడు.

భారత్ క్రికెట్‌కు ధోని ఎన్నో సేవలందించాడు. ఓ ఆటగాడి కంటే ఎక్కువగానే ధోని ఇండియన్ జట్టుకు ఎంతో చేశాడు. ధోనీకి అన్నీ తెలుసు. తనకు ఎప్పుడు నచ్చితే అప్పుడే రిటైరవుతాడు. అందుకు సరైన సమయమేదో అతడికి తెలుసు. ఒక ప్లేయర్ ఎప్పుడు రిటైర్ అవ్వాలో కూడా మీరే చెప్పేస్తారా.. ధోని లేని క్రికెట్ చూడని వాళ్ళు కూడా ఉంటారు… దయచేసి సలహాలు ఇవ్వకండి అంటూ’ విమర్శకులకు చురకలు అంటించాడు.

మరోవైపు ప్రపంచకప్‌లో భారత్ జట్టుకు ధోని ఎంతో కీలకం అని జట్టు సీనియర్లతో పాటు మాజీలు కూడా అభిప్రాయపడుతున్నారు.