లంకపై ఆసీస్ విజయం..!
సోమవారం శ్రీలంకతో జరిగిన ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. తిరిమానె (56), డిసిల్వా (43) రాణించడంతో నిర్ణేత 50 ఓవర్లలో 8 వికెట్లకు 239 పరుగులు చేసింది. ఇక అటు లక్ష్యఛేదనలో భాగంగా బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టుకు.. ఓపెనర్ ఖవాజా (89) మెరుపులు మెరిపించడంతో లక్ష్యాన్ని 44.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ప్రాక్టీస్ […]
సోమవారం శ్రీలంకతో జరిగిన ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. తిరిమానె (56), డిసిల్వా (43) రాణించడంతో నిర్ణేత 50 ఓవర్లలో 8 వికెట్లకు 239 పరుగులు చేసింది. ఇక అటు లక్ష్యఛేదనలో భాగంగా బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టుకు.. ఓపెనర్ ఖవాజా (89) మెరుపులు మెరిపించడంతో లక్ష్యాన్ని 44.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ జట్టు.. రూట్ (3/22), ఆర్చర్ (3/32) ధాటికి 38.4 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటైంది. మహ్మద్ నబి (44) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్.. జేసన్ రాయ్ (89 నాటౌట్) చెలరేగడంతో లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది.