ఐనాక్స్ తెరలపై ఐసీసీ మ్యాచ్‌లు!
భారత్‌లో రెండో అతిపెద్ద మల్టీప్లెక్స్ సంస్థ ఐనాక్స్… ఐసీసీతో చేతులు కలిపింది. రాబోయే ఐసీసీ ప్రపంచకప్ మ్యాచ్‌లలో కొన్నింటిని తన భారీ తెరలపై ప్రసారం చేయనుంది. మే 30నుంచి ఇంగ్లాండ్‌లో ఐసీసీ ప్రపంచకప్ 2019 ప్రారంభం కానుంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. క్రికెట్ అభిమానులకు పెట్టింది పేరైన భారత్‌లో టీమిండియా జట్టుకు సంబంధించిన తొమ్మిది మ్యాచ్‌లతో సహా సెమీ ఫైనల్, ఫైనల్ వంటి 15 కీలక మ్యాచ్‌లను ఐనాక్స్ మల్టీప్లెక్స్‌లలో ప్రసారం చేయనుంది. […]
భారత్‌లో రెండో అతిపెద్ద మల్టీప్లెక్స్ సంస్థ ఐనాక్స్… ఐసీసీతో చేతులు కలిపింది. రాబోయే ఐసీసీ ప్రపంచకప్ మ్యాచ్‌లలో కొన్నింటిని తన భారీ తెరలపై ప్రసారం చేయనుంది. మే 30నుంచి ఇంగ్లాండ్‌లో ఐసీసీ ప్రపంచకప్ 2019 ప్రారంభం కానుంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. క్రికెట్ అభిమానులకు పెట్టింది పేరైన భారత్‌లో టీమిండియా జట్టుకు సంబంధించిన తొమ్మిది మ్యాచ్‌లతో సహా సెమీ ఫైనల్, ఫైనల్ వంటి 15 కీలక మ్యాచ్‌లను ఐనాక్స్ మల్టీప్లెక్స్‌లలో ప్రసారం చేయనుంది.
ముంబయి, దిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పుణె, జైపుర్, ఇండోర్, వడోదర, సూరత్, నోయిడా, గూర్గావ్, ఫరీదాబాద్‌లోని భారీ తెరలపై ఐనాక్స్ క్రికెట్ అభిమానులకు వినోదం పంచనుంది. దీనిపై ఐనాక్స్ లీజర్ సీఈవో అలోక్ టాండన్ మాట్లాడుతూ.. ‘ఐనాక్స్ క్రికెట్ స్టేడియంగా మారబోతోంది. క్రికెట్ అభిమానులకు ఉత్తేజకరమైన అనుభూతిని అందించనుంది’ అని తెలిపారు.