Shahid Afridi: భారత్‌తో మ్యాచ్‌కు ముందు నిద్రపోయేవాళ్లం కాదు.. ఆసక్తికర విషయాలు చెప్పిన షాహిద్ అఫ్రిది..
భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్ అంటే ఇరుదేశాలకు ఉత్కంఠగా ఉంటుంది. అదరి కళ్లు టీవీలపైనే ఉంటాయి...
భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్ అంటే ఇరుదేశాలకు ఉత్కంఠగా ఉంటుంది. అదరి కళ్లు టీవీలపైనే ఉంటాయి. ఈ ఏడాది దుబాయ్‌లో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో ఇరు జట్లు పోటీ పడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయింది. పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిది భారత్‌ను మ్యాచ్ ఆరంభంలోనే దెబ్బ తీశాడు. షహీన్ నాలుగు ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. అయితే, భారత్‌తో మ్యాచ్‌కు ముందు యువ పేసర్ తనకు ఫోన్ చేశాడని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది వెల్లడించాడు. అతను ఒత్తిడిలో ఉన్నందున షాహీన్ తనకు “వీడియో-కాల్” చేశాడని అతను చెప్పాడు.
“భారత్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌కి ముందు, షాహీన్ నాకు వీడియో కాల్ చేసి, ‘నేను కొంత ఒత్తిడికి గురవుతున్నాను’ అని చెప్పాడు. నేను అతడితో దాదాపు 11-12 నిమిషాలు మాట్లాడాను. దేవుడు మీకు అవకాశం ఇచ్చాడని నేను అతనితో చెప్పాను. బయటకు వెళ్లి ప్రదర్శన ఇవ్వండి. ఆ వికెట్లు తీయండి. హీరో అవ్వండి.” అని చెప్పినట్లు అఫ్రిది తెలిపాడు. ఆఫ్రిది తన ఆడే రోజుల్లో భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ ఆటగాళ్లు నిద్రపోలేదని గుర్తుచేసుకున్నాడు. రెండు దేశాల మధ్య ఘర్షణ సమయంలో ఒత్తిడి ఎప్పుడూ విపరీతంగా ఉండేదని చెప్పాడు.
” భారత్‌తో మాచ్య్కు ముందు మేము నిద్రపోయేవాళ్లం కాదు. కొంతమంది ఆటగాళ్లు ఒక మూలకు మారేవారు, మరికొందరు మ్యాచ్ కోసం వేచి చూసే వారు. వ్యక్తిగతంగా చెప్పాలంటే, నేను మ్యాచ్ కోసం వేచి ఉండేవాడిని.” అని అఫ్రిది చెప్పాడు. గ్రూప్-బిలో అగ్రస్థానంలో నిలిచిన పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది.సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో వారి ప్రయాణం ముగిసింది.
Read Also.. Harbhajan Singh: హర్భజన్ సింగ్ ఏ పార్టీలో చేరబోతున్నారు.. ఊపందుకున్న ఊహాగానాలు..