WI vs SCO: టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం.. విండీస్‌కు భారీ షాకిచ్చిన స్కాట్లాండ్..
ICC Mens T20 World Cup 2022: రెండో రోజు తొలి మ్యాచ్ లో స్కాట్లాండ్ టీం రెండుసార్లు పొట్టి ప్రపంచ కప్ గెలిచిన వెస్టిండీస్ జట్టుకు చుక్కలు చూపించింది. 160 పరుగులు టార్గెట్ తో బరిలోకి దిగిన విండీస్ జట్టును కేవలం..
టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. కాగా, తొలి రోజు ఆసియా కప్ విజేతకు భారీ షాక్ ఇచ్చిన నమీబియా టీం టీ20 ప్రపంచ కప్ లో సంచలనం నెలకొల్పింది. ఇక రెండో రోజు తొలి మ్యాచ్ లో స్కాట్లాండ్ టీం రెండుసార్లు పొట్టి ప్రపంచ కప్ గెలిచిన వెస్టిండీస్ జట్టుకు చుక్కలు చూపించింది. 160 పరుగులు టార్గెట్ తో బరిలోకి దిగిన విండీస్ జట్టును కేవలం 118 పరుగులకే పరిమితం చేసి, 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చిన్న జట్టైనా అన్ని రంగాల్లో సత్తా చాటి, ప్రపంచాన్ని ఒక్కసారిగా తనవైపు చూసేలా చేసుకుంది. హోబర్ట్‌లోని బల్లెరివ్ ఓవల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత ఆడిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. ఓపెనర్ జార్జ్ మున్సే తన ఎనిమిదో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. అతను 53 బంతుల్లో 124.52 స్ట్రైక్ రేట్‌తో 66 పరుగులు చేశాడు. క్రిస్ గ్రీవ్స్ 16 పరుగులతో నాటౌట్‌గా వెనుదిరిగాడు. వీరిద్దరు కాకుండా మెక్‌లియోడ్ 23, జోన్స్ 20 పరుగులు చేశారు. స్మిత్ ఖాతాలో ఒక వికెట్ చేరింది. కాగా, హోల్డర్, జోసెఫ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
మున్సే-జోన్స్‌కు శుభారంభం..
స్కాట్లాండ్ ఓపెనర్లు జార్జ్ మున్సే, మైఖేల్ జోన్స్ శుభారంభం అందించారు. వీరిద్దరి మధ్య 55 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెకలొంది. జోన్స్ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. 3 ఫోర్ల సాయంతో 20 పరుగులు చేశాడు.
వెస్టిండీస్ ఓపెనర్లిద్దరూ టీం స్కోర్ 53 పరుగుల వద్దే పెవిలియన్‌కు చేరుకున్నారు. అనంతరం వెస్టిండీస్ 12 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఏదశలోనూ టీం కోలుకోలేకపోయింది. మొత్తంగా 18.3 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌట్ అయింది. విండీస్ టీంలో హోల్డర్ 38 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్ 3 వికెట్లు, మైకేల్ లీష్, బ్రాడ్ వీల్ తలో 2 వికెట్లు, జోష్ డేవీ, షరీఫ్ తలో వికెట్ పడగొట్టారు.
టాప్-2 జట్లు సూపర్-12కి ఎంట్రీ..
క్వాలిఫయింగ్ రౌండ్‌లో 8 జట్లు సూపర్ 12లో తమ స్థానం కోసం పోరాడుతున్నాయి. ఈ రౌండ్‌లో 4 జట్లతో కూడిన రెండు గ్రూపులు ఉన్నాయి. ఇందులో గ్రూప్‌లోని టాప్ 2 జట్లను సూపర్ 12లో చేరుతాయి.
ఇరుజట్ల ప్లేయింగ్ XI..
స్కాట్లాండ్: జార్జ్ మున్సే, మైఖేల్ జోన్స్, మాథ్యూ క్రాస్ (WK), రిచీ బెరింగ్‌టన్ (c), కల్లమ్ మెక్‌లియోడ్, క్రిస్ గ్రీవ్స్, మైఖేల్ లీష్, మార్క్ వాట్స్, జోష్ డేవీ, సఫ్యాన్ షరీఫ్, బ్రాడ్ వీల్స్.
వెస్టిండీస్: కైల్ మేయర్స్, ఎవిన్ లూయిస్, బ్రాండన్ కింగ్, షమ్రా బ్రూక్స్, నికోలస్ పూరన్ (c & wk), రోవ్‌మన్ పావెల్, జాసన్ హోల్డర్, ఓడియన్ స్మిత్, అకీల్ హోస్సేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్.