World Cup: ప్రపంచకప్‌లో సడన్ ఎంట్రీ ఇచ్చిన చిన్న దేశం.. ఎలాగంటే?

Cricket World Cup: ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, ఐర్లాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, ఆతిథ్య శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే ప్రపంచ కప్ (U-19 ప్రపంచ కప్)కి నేరుగా ప్రవేశించాయి. ఇప్పుడు స్కాట్లాండ్, నమీబియా, న్యూజిలాండ్, నేపాల్ ప్రాంతీయ క్వాలిఫయర్స్ ద్వారా ప్రవేశం పొందాయి. ఈ టోర్నమెంట్‌లో ప్రాంతీయ క్వాలిఫైయర్‌ల నుంచి మొత్తం 5 జట్లు పాల్గొంటాయి.

World Cup: ప్రపంచకప్‌లో సడన్ ఎంట్రీ ఇచ్చిన చిన్న దేశం.. ఎలాగంటే?
Scotland
Follow us
Venkata Chari

|

Updated on: Aug 13, 2023 | 5:59 PM

Under-19 Cricket World Cup 2024: వన్డే ప్రపంచ కప్ 2023 అహ్మదాబాద్‌లో ప్రారంభమవుతుంది. దీని చివరి మ్యాచ్ నవంబర్ 19న జరుగుతుంది. అదే సమయంలో అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ (Under-19 Cricket World Cup 2024) వచ్చే ఏడాది శ్రీలంకలో జరగనుంది. చిన్న దేశానికి చెందిన ఓ జట్టు ఈ టోర్నీకి అర్హత సాధించింది. అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం టిక్కెట్‌ను ధృవీకరించిన నాల్గవ జట్టుగా నిలిచింది.

ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జట్టు..

స్కాట్లాండ్ జట్టు అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ 2024కి అర్హత సాధించింది. యూరప్ క్వాలిఫయర్‌లో విజయం సాధించడం ద్వారా స్కాట్లాండ్ అండర్-19 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకుంది. గత నెలలో, న్యూజిలాండ్ ఈస్ట్-పసిఫిక్ క్వాలిఫైయర్‌ను గెలుచుకోగా, నేపాల్ ఆసియా క్వాలిఫైయర్‌లో గెలిచి ప్రపంచ కప్‌నకు తమ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. అదే సమయంలో ఈ నెల ప్రారంభంలో ఆఫ్రికన్ ప్రాంతం క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌ను గెలుచుకోవడం ద్వారా నమీబియా ప్రపంచ కప్ 2024లో తన స్థానాన్ని సంపాదించుకుంది. అండర్-19 ప్రపంచ కప్ 2024లో మొత్తం 16 జట్లు పాల్గొనబోతున్నాయి.

బలమైన ఆటతో దూసుకొచ్చిన స్కాట్లాండ్..

గ్వెర్న్సీతో జరిగిన మొదటి మ్యాచ్ వాష్ అవుట్ అయిన తర్వాత క్వాలిఫయర్స్‌లో స్కాట్లాండ్ ఆధిపత్యం చెలాయించింది. నార్వే, ఇటలీలను ఓడించే ముందు చివరి రెండు మ్యాచ్‌లలో జెర్సీని 70 పరుగులతో, నెదర్లాండ్స్‌ను 46 పరుగులతో ఓడించింది. నార్వేను 116 పరుగులకు ఆలౌట్ చేసిన తర్వాత పది వికెట్ల తేడాతో గెలిచింది. శనివారం ఇటలీతో జరిగిన మ్యచ్‌లో మొదట బ్యాటింగ్ చేసి 229 పరుగులు చేసింది. అనంతంర ప్రత్యర్థి జట్టును కేవలం 78 పరుగులకే ఆలౌట్ చేశారు.

ఈ జట్లు ప్రపంచ కప్ 2024లో ఆడనున్నాయి..

ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, ఐర్లాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, ఆతిథ్య శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే ప్రపంచ కప్ (U-19 ప్రపంచ కప్)కి నేరుగా ప్రవేశించాయి. ఇప్పుడు స్కాట్లాండ్, నమీబియా, న్యూజిలాండ్, నేపాల్ ప్రాంతీయ క్వాలిఫయర్స్ ద్వారా ప్రవేశం పొందాయి. ఈ టోర్నమెంట్‌లో ప్రాంతీయ క్వాలిఫైయర్‌ల నుంచి మొత్తం 5 జట్లు పాల్గొంటాయి. ఇప్పుడు చివరి జట్టు US క్వాలిఫయర్స్ నుంచి నిర్ణయించనున్నారు.

చివరి స్థానం కోసం ఈ జట్ల మధ్య పోటీ..

అర్జెంటీనా, బెర్ముడా, ఆతిథ్య కెనడా, సురినామ్, USA జట్లు పాల్గొనే అమెరికన్ రీజియన్‌కు సంబంధించిన క్వాలిఫైయర్‌లు ఆగస్టు 11న ప్రారంభమవుతాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..