IND Vs AUS: 7 టెస్టులు.. 28 వికెట్లు.. డేంజరస్ బౌలర్‌తో బరిలోకి.. రోహిత్ సేన ఖేల్ ఖతమంటోన్న ఆసీస్ సారథి..
WTC Final 2023, Australia Playing 11: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. జూన్ 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కి సంబంధించి ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ కీలక ప్రకటన చేశాడు. ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకుంటాడని మ్యాచ్‌కు ఒక రోజు ముందు కమిన్స్ ధృవీకరించాడు.

IND Vs AUS: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. జూన్ 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కి సంబంధించి ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ కీలక ప్రకటన చేశాడు. ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకుంటాడని మ్యాచ్‌కు ఒక రోజు ముందు కమిన్స్ ధృవీకరించాడు. దీంతో పాటు ఫైనల్ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా నుంచి బరిలోకిదిగబోయే 11మంది ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఫైనల్‌కు ముందు, జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా జట్టుకు దూరమవ్వగానే ఆస్ట్రేలియా కష్టాలు పెరిగాయి. అయితే, ఇప్పుడు ఆస్ట్రేలియా హాజిల్‌వుడ్‌కు ప్రత్యామ్నాయాన్ని కనుగొంది. హాజిల్‌వుడ్ స్థానంలో అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్న బోలాండ్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్నాడు. ఇది కాకుండా, కమిన్స్‌తో స్టార్క్ ఆడాలని నిర్ణయించుకున్నారు. ఆస్ట్రేలియా కేవలం ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతోనే రంగంలోకి దిగనుంది.
మ్యాచ్‌కు ముందు కమిన్స్ బోలాండ్‌ను తీవ్రంగా ప్రశంసించాడు. కమ్మిన్స్ మాట్లాడుతూ, “మా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు కొంచెం భిన్నమైన రీతిలో బౌలింగ్ చేస్తారు. స్కాట్ సిమ్ బౌలర్, అతను మంచి లెంగ్త్‌ను అందిస్తాడు. హేజిల్‌వుడ్ బౌలింగ్ స్టైలే వేరు.. స్టార్క్ ఎడమచేత్తో బౌలింగ్ చేయడం పూర్తిగా భిన్నం. మాకు చాలా మంచి ఎంపికలు అందుబాటులో ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు.




బలమైన బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బరిలోకి..
బోలాండ్ తన తొలి టెస్టును ఇంగ్లండ్‌లో ఆడబోతున్నాడు. దీనికి ముందు బోలాండ్ 7 టెస్టులు ఆడి 13 సగటుతో 28 వికెట్లు పడగొట్టాడు. కమ్మిన్స్ మాట్లాడుతూ, “స్కాట్ గేమ్ ప్లాన్ చాలా సులభం. రోజంతా మంచి ప్రదేశంలో బౌలింగ్ చేస్తే, బంతితో అద్భుతాలు చేయోచ్చు. మాకు గ్రీన్, లయన్ ఎంపిక కూడా ఉంది. ఆస్ట్రేలియా బౌలింగ్ ఎటాక్ చాలా బాగుంది” అంటూ చెప్పుకొచ్చాడు.
వార్నర్, ఖవాజాలకు ఓపెనింగ్ బాధ్యతలను ఆస్ట్రేలియా అప్పగిస్తున్నట్లు తేలింది. మిడిల్ ఆర్డర్ స్మిత్, లాబుషెన్, హెడ్‌ల భుజాలపై ఉంటుంది. లోయర్ మిడిల్ ఆర్డర్‌ను గ్రీన్, కారే చూసుకుంటారు. బౌలింగ్‌లో ఆస్ట్రేలియాకు కమిన్స్, స్టార్క్, బోలాండ్, లయన్‌లు ఉండే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
