AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AUS vs IND Highlights, WTC Final 2023 Day 1: మొదటి రోజు ఆస్ట్రేలియాదే.. భారీ స్కోరు దిశగా కంగారూలు

Australia vs India Highlights in Telugu: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య ఓవల్ మైదానంలో జరుగుతోంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అంతకుముందు, బాలాసోర్ రైలు ప్రమాదంలో మృతులకు నివాళులు అర్పించేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లతో నివాళులర్పించారు.

AUS vs IND Highlights, WTC Final 2023 Day 1: మొదటి రోజు ఆస్ట్రేలియాదే.. భారీ స్కోరు దిశగా కంగారూలు
WTC Final Live Score
Venkata Chari
| Edited By: |

Updated on: Jun 07, 2023 | 10:39 PM

Share
Australia vs India Highlights in Telugu: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య ఓవల్ మైదానంలో జరుగుతోంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అంతకుముందు, బాలాసోర్ రైలు ప్రమాదంలో మృతులకు నివాళులు అర్పించేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లతో నివాళులర్పించారు. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. భారత్‌- ఆస్ట్రేలియా ఆడబోయే ఈ మ్యాచ్‌కి ఇంగ్లాండ్‌లోని ఓవల్ గ్రౌండ్‌ ఆతిథ్యమివ్వనుంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య టెస్ట్ ఛాంపియన్స్ షిప్ టైటిల్ మినహాయించి అన్ని ఐసీసీ టైటిల్స్ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని భావిస్తున్నాయి. టీమిండియా వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ కు చేరింది. ఆసీస్‌తో తలపడేందుకు సిద్ధమైంది.
ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ కీలకంగా మారే అవకాశం ఉంది. రన్‌ మెషిన్‌ చెలరిగితే ఆసీస్‌ తట్టుకోవడం కష్టమే. ఇప్పటిదాకా ఆసీస్‌పై ఉన్న గణాంకాలే ఆ నిజాన్ని చెబుతున్నాయి. మరోవైపు కోహ్లీ ముందు కొన్ని రికార్డ్‌లు ఊరిస్తున్నాయి. ఆసీస్‌పై టెస్టుల్లో 1,979 పరుగులు చేసిన కోహ్లీ మరో 21 రన్స్ చేస్తే రెండువేల పరుగుల మైలురాయి చేరుకుంటాడు. కొంతకాలంగా ఐసీసీ ట్రోఫీల కరువును ఎదుర్కొంటున్న టీమిండియా.. ఈ టైటిల్‌ గెలిచి అభిమానుల్ని అలరించాలని పట్టుదలగా ఉంది.

 ఇరుజట్లు:

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, శ్రీకర్ భరత్(కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 07 Jun 2023 10:38 PM (IST)

    మొదటి రోజు ఆసీస్ దే..

    డబ్ల్యూటీసీ ఫైనల్ మొదటి రోజు ఆట ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది.  హెడ్ (146), స్మిత్ (95) రన్స్ తో క్రీజులో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో షమీ, సిరాజ్, శార్దూల్ తలా ఒక వికెట్ తీశారు.

  • 07 Jun 2023 10:28 PM (IST)

    ప్చ్.. భారత బౌలర్లకు తప్పని నిరాశ..

    కొత్త బంతిని తీసుకున్నా భారత బౌలర్లకు వికెట్ దక్కలేదు. స్మిత్, హెడ్ జోడీ పరుగుల వర్షం కురిపిస్తోంది.  ఇప్పటికే వీరిద్దరు అజేయమైన నాలుగో వికెట్ కు 244 పరుగులు జోడించారు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 84 ఓవర్లలో 320/3.  హెడ్ (143), స్మిత్ (90) రన్స్ తో క్రీజులో ఉన్నారు.

  • 07 Jun 2023 09:08 PM (IST)

    భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా..

    మూడో సెషన్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్లకు 238 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 53, ట్రావిస్ హెడ్ 100 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య భాగస్వామ్యం 150 పరుగులు దాటింది.

    హెడ్ ​​కెరీర్‌లో 5వ సెంచరీ సాధించాడు. ఈ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. స్టీవ్ స్మిత్ 38వ ఫిఫ్టీని సాధించాడు.

  • 07 Jun 2023 08:47 PM (IST)

    సెంచరీ దిశగా హెడ్.. హాఫ్ సెంచరీకి చేరువలో స్మిత్..

    మూడో సెషన్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్లకు 222 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 49, ట్రావిస్ హెడ్ 94 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం ఉంది.

    హెడ్ ​​తన కెరీర్‌లో 14వ హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఆరో సెంచరీకి చేరువలో ఉన్నాడు. స్మిత్ కూడా యాభైకి చేరువలో ఉన్నాడు.

  • 07 Jun 2023 07:22 PM (IST)

    ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ..

    భాతర బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్న ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ(52 పరుగులు, 60 బంతులు) పూర్తి చేశాడు. వన్డే బ్యాటింగ్ చేస్తూ పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. దీంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా 45 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 161 పరుగులు పూర్తి చేసింది. స్మిత్(32), హెడ్ మధ్య 85 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.

  • 07 Jun 2023 07:17 PM (IST)

    వికెట్ల కోసం భారత బౌలర్ల ఎదురుచూపులు..

    రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్లకు 153 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 29, తెవిస్ హెడ్ 47 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య అర్ధ సెంచరీ భాగస్వామ్యం ఉంది.

  • 07 Jun 2023 06:31 PM (IST)

    మరో కీలక భాగస్వామ్యం దిశగా ఆస్ట్రేలియా..

    రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్లకు 116 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 13, తెవిస్ హెడ్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు.

    మార్నస్ లాబుషెన్ 26 పరుగుల వద్ద అవుటయ్యాడు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అంతకుముందు డేవిడ్ వార్నర్ 43 పరుగుల వద్ద, ఉస్మాన్ ఖవాజా సున్నాతో ఔటయ్యారు.

    శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌లకు చెరో వికెట్ దక్కింది.

  • 07 Jun 2023 05:50 PM (IST)

    లబూషెన్ ఔట్.. లంచ్ తర్వాత షాకిచ్చిన షమీ..

    లంచ్ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు మహ్మద్ షమీ షాకిచ్చాడు. ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ మార్నస్ లబూషెన్‌(26)ను బౌల్డ్ చేశాడు. దీంతో 76 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్‌ను కోల్పోయింది.

  • 07 Jun 2023 05:04 PM (IST)

    లంచ్ టైం..

    తొలి సెషన్‌ పూర్తయ్యే సరికి ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. మార్నస్ లబుషెన్ 26, స్మిత్ 2 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. డేవిడ్ వార్నర్ 43 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. సిరాజ్, శార్దుల్ తలో వికెట్ పడగొట్టారు.

  • 07 Jun 2023 04:58 PM (IST)

    డేవిడ్ వార్నర్ ఔట్..

    భాతర బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్న డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ(43 పరుగులు) వైపు దూసుకెళ్తున్నాడు. అయితే, ఇన్నింగ్స్ 21.4వ ఓవర్లో శార్తుల్ ఠాకూర్ బౌలింగ్‌లో కీపర్ కేఎస్ భరత్ స్టన్నింగ్ క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. దీంతో హాఫ్ సెంచరీ చేయకుండానే వికెట్ కోల్పోయాడు. దీంతో డేంజరస్‌గా మారుతోన్న భాగస్వామ్యాన్ని విడదీశారు. వార్నర్, మార్నస్‌ల మధ్య రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.

  • 07 Jun 2023 04:34 PM (IST)

    తొలి సెషన్‌లో ఆస్ట్రేలియా స్కోర్..

    తొలి సెషన్‌లో ఆస్ట్రేలియా ఒక వికెట్‌ నష్టానికి 55 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 38, మార్నస్ లబుషెన్ 16 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. వీరిద్దరి మధ్య అర్ధ సెంచరీ భాగస్వామ్యం ఉంది.

  • 07 Jun 2023 04:17 PM (IST)

    14 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్..

    14 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా టీం ఒక వికెట్ కోల్పోయి 38 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ వార్నర్ 21, మార్నస్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 07 Jun 2023 03:19 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా..

    టాస్ ఓడి బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు హైదరాబాదీ పేసర్ తొలి షాక్ అందించాడు. డేంజరస్ ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా రూపంలో కంగారులు తొలి వికెట్ కోల్పోయింది. దీంతో సిరాజ్ రూపంలో రోహిత్ సేనకు తొలి విజయం దక్కింది.

  • 07 Jun 2023 02:55 PM (IST)

    ఇరుజట్ల ప్లేయింగ్ 11

    జట్లు:

    ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.

    భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, శ్రీకర్ భరత్(కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

  • 07 Jun 2023 02:47 PM (IST)

    టాస్ గెలిచిన రోహిత్..

    వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో భారత్ ఫీల్డింగ్ చేయనుంది. ఇంగ్లండ్‌లోని ఓవల్‌ మైదానంలో ఈ మ్యాచ్‌ జరుగుతోంది. ఇంగ్లండ్‌లో ఇరు జట్లు తొలిసారిగా తలపడుతున్నాయి

  • 07 Jun 2023 02:10 PM (IST)

    ఇంగ్లండ్‌లో ఇరుజట్ల రికార్డులు..

    ఆస్ట్రేలియా ఇప్పటి వరకు ఇంగ్లండ్‌లో 176 టెస్టులు ఆడగా, అందులో కేవలం 31% మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అదే సమయంలో ఇక్కడ టీమ్ ఇండియా 68 మ్యాచ్‌లు ఆడి 9 మాత్రమే గెలిచింది. మైదానం గురించి చెప్పాలంటే, ఓవల్‌లో ఆస్ట్రేలియా 38 టెస్టుల్లో 7 మాత్రమే గెలిచింది.అంటే 14% మ్యాచ్‌లు గెలిచింది. భారత్ ఇక్కడ 14 మ్యాచ్‌లు ఆడగా 2 మాత్రమే గెలిచింది.

  • 07 Jun 2023 02:00 PM (IST)

    భారత్(ప్లేయింగ్ XI అంచనా):

    రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రవీంద్ర జడేజా, కెఎస్ భరత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్/శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్/జయ్‌దేవ్ ఉనద్కత్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

  • 07 Jun 2023 01:45 PM (IST)

    ఆస్ట్రేలియా(ప్లేయింగ్ XI అంచనా):

    డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషెన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), స్కాట్ బోలాండ్, నాథన్ లియోన్

  • 07 Jun 2023 01:21 PM (IST)

    డబ్ల్యూటీసీ ఫైనల్‌కి భారత్ సిద్దం..

Published On - Jun 07,2023 1:15 PM