సర్ఫరాజ్ మమ్మల్ని క్షమించు.. పాక్ ఫ్యాన్స్ అభ్యర్థన!

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైంది. దీంతో పాకిస్థాన్ జట్టు, కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై ఆ దేశ అభిమానులందరూ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఏకంగా జట్టునే నిషేధించాలంటూ కొంతమంది అభిమానులు అసభ్యపదజాలంతో దూషించారు. ఇది ఇలా ఉంటే ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్  విజయం నమోదు చేయడంతో ఆ దేశ అభిమానులు మళ్ళీ కెప్టెన్ సర్ఫరాజ్‌పై ప్రేమను కురిపిస్తున్నారు. సఫారీలతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌కు క్షమాపణలు చెబుతూ.. కొంతమంది అభిమానులు […]

సర్ఫరాజ్ మమ్మల్ని క్షమించు.. పాక్ ఫ్యాన్స్ అభ్యర్థన!
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 25, 2019 | 12:32 PM

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైంది. దీంతో పాకిస్థాన్ జట్టు, కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై ఆ దేశ అభిమానులందరూ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఏకంగా జట్టునే నిషేధించాలంటూ కొంతమంది అభిమానులు అసభ్యపదజాలంతో దూషించారు. ఇది ఇలా ఉంటే ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్  విజయం నమోదు చేయడంతో ఆ దేశ అభిమానులు మళ్ళీ కెప్టెన్ సర్ఫరాజ్‌పై ప్రేమను కురిపిస్తున్నారు. సఫారీలతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌కు క్షమాపణలు చెబుతూ.. కొంతమంది అభిమానులు పోస్టర్స్‌ను ప్రదర్శించారు.

పాకిస్థాన్‌కు చిరకాల ప్రత్యర్థి అయిన భారత్ చేతిలో ఓడిపోవడం వల్ల ఆ దేశ అభిమానుల కోపం కట్టెలు తెంచుకుంది. అటు అభిమానులు, ఇటు మాజీ ఆటగాళ్లు జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక వీటిపై పాక్ బౌలర్ అమిర్ స్పందిస్తూ.. తమని విమర్శించండి కానీ దూషించొద్దని అభ్యర్థించాడు. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయాన్ని నమోదు చేసుకుంది. దీనితో పాక్ అభిమానులు పెద్ద ఎత్తున కెప్టెన్ సర్ఫరాజ్‌కు క్షమాపణలు చెప్పడం మొదలు పెట్టారు.