భారత్‌ను ఓడిస్తాం – షకీబ్
సౌధాంఫ్టన్ వేదికగా అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ సూపర్ విక్టరీని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు విజయం సాధించడంలో ఆల్‌రౌండర్ షకిబుల్ హాసన్ కీలకపాత్ర పోషించాడు. ఇక ‘మ్యాన్ అఫ్ ది మ్యాచ్’ అవార్డు సాధించిన షకీబ్ మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో జూలై 2న భారత్‌తో జరిగే మ్యాచ్‌పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ‘భారత్‌తో జరిగే మ్యాచ్ మాకు చాలా కీలకం. ప్రపంచకప్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియాను […]
సౌధాంఫ్టన్ వేదికగా అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ సూపర్ విక్టరీని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు విజయం సాధించడంలో ఆల్‌రౌండర్ షకిబుల్ హాసన్ కీలకపాత్ర పోషించాడు. ఇక ‘మ్యాన్ అఫ్ ది మ్యాచ్’ అవార్డు సాధించిన షకీబ్ మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో జూలై 2న భారత్‌తో జరిగే మ్యాచ్‌పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
‘భారత్‌తో జరిగే మ్యాచ్ మాకు చాలా కీలకం. ప్రపంచకప్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియాను ఓడించడం అంత సులువు కాదు. భారత్‌కు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌తో పాటు పదునైన పేస్ బౌలింగ్ కూడా ఉంది. అయినా భారత్‌ను ఓడించడానికి మేము గట్టిగా ప్రయత్నిస్తాం. భారత్ టైటిల్ ఫేవరెటైనా.. మాకు ఓడించే సత్తా ఉంది. మా జట్టుపై నాకు పూర్తి విశ్వాసం ఉందని’ షకీబ్ మీడియాకు తెలిపాడు.