భారత్‌తో ఓడినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: పాక్ కోచ్

ప్రపంచ‌కప్‌లో భారత్ చేతిలో తమ జట్టు ఓడిపోవడం చాలా బాధించిందని, ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చిందని పాకిస్తాన్ కోచ్ మికీ ఆర్థర్ అన్నాడు. ప్రపంచకప్ అంటే అందరిలో అంచనాలు పెరుగుతుంటాయి. ఆ సమయంలో ఓడిపోతే ఒత్తిడి బాగా పెరుగుతుంది. అందరూ అలాంటి స్థితిని ఎదుర్కొంటారు అని ఆర్థర్ అన్నాడు. ఇక భారత్‌తో తమ టీమ్ ఆడిన ఆట పేలవ ప్రదర్శన. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అంటూ పేర్కొన్నాడు. ఇక సౌతాఫ్రికాతో విజయం […]

భారత్‌తో ఓడినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: పాక్ కోచ్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 25, 2019 | 9:48 AM

ప్రపంచ‌కప్‌లో భారత్ చేతిలో తమ జట్టు ఓడిపోవడం చాలా బాధించిందని, ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చిందని పాకిస్తాన్ కోచ్ మికీ ఆర్థర్ అన్నాడు. ప్రపంచకప్ అంటే అందరిలో అంచనాలు పెరుగుతుంటాయి. ఆ సమయంలో ఓడిపోతే ఒత్తిడి బాగా పెరుగుతుంది. అందరూ అలాంటి స్థితిని ఎదుర్కొంటారు అని ఆర్థర్ అన్నాడు. ఇక భారత్‌తో తమ టీమ్ ఆడిన ఆట పేలవ ప్రదర్శన. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అంటూ పేర్కొన్నాడు. ఇక సౌతాఫ్రికాతో విజయం తరువాత తమకు కాస్త బూస్టప్ లభించిందని దీంతో తదుపరి మ్యాచ్‌లను గెలుస్తామన్న ధీమా తమలో పెరిగిందని ఆర్థర్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఈ నెల 16న జరిగిన భారత్- పాక్ మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో కోహ్లీ సేన విజయం సాధించిన విషయం తెలిసిందే.