World Cup 2023: సంజూ శాంసన్‌ ఇలాకాలో టీమిండియా మ్యాచ్‌.. గొప్ప మనసు చాటుకున్న కేరళ క్రికెటర్

మ్యాచ్‌కు ముందు గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేశారు. సంజూ శాంసన్‌ పోస్టర్‌ ముందున్న నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. కాగా తిరువనంతపురం సంజూ శాంసన్‌ స్వస్థలమన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ షేర్‌ చేశాడు శాంసన్‌. తన పోస్టర్‌ ముందు భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేస్తోన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘టీమిండియాతో ఇలా.. ఈ దైవ భూమిలో' అని రాసుకొచ్చాడు

World Cup 2023: సంజూ శాంసన్‌ ఇలాకాలో టీమిండియా మ్యాచ్‌.. గొప్ప మనసు చాటుకున్న కేరళ క్రికెటర్
Sanju Samson
Follow us

|

Updated on: Oct 04, 2023 | 5:55 AM

వన్డే వరల్డ్‌ కప్‌ టోర్నీలో భాగంగా మంగళవారం (అక్టోబర్‌ 3)న భారత్, నెదర్లాండ్స్‌ జట్ల మధ్య వార్మప్‌ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. తిరువనంతపురం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చింది. అయితే భారీ వర్షాలతో ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కూడా తుడిచిపెట్టుకుపోయింది. కాగా మ్యాచ్‌కు ముందు గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేశారు. సంజూ శాంసన్‌ పోస్టర్‌ ముందున్న నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. కాగా తిరువనంతపురం సంజూ శాంసన్‌ స్వస్థలమన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ షేర్‌ చేశాడు శాంసన్‌. తన పోస్టర్‌ ముందు భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేస్తోన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘టీమిండియాతో ఇలా.. ఈ దైవ భూమిలో’ అని రాసుకొచ్చాడు. దీనికి విక్టరీ సింబల్‌ను కూడా జతచేశాడు. ఆడినా, ఆడకపోయినా తాను ఎల్లప్పుడూ టీమిండియాతోనే ఉంటానంటూ అర్థమొచ్చేలా శాంసన్‌ షేర్‌ చేసిన పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ముఖ్యంగా అతని అభిమానులు చాలా ఫీలయ్యారు. ‘చాలా బాధగా ఉంది భయ్యా.. నువ్వు కూడా టీమిండియాలో ఉండి ఉంటే చాలా బాగుండేది’ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. కాగా సొంతగడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆడాలని ఎన్నో కలలు కన్నాడీ వికెట్‌ కీపర్‌ అండ్‌ బ్యాటర్‌. అయితే బీసీసీఐ సెలెక్టర్లు అతనిని పరిగణణలోకి తీసుకోలేదు. శాంసన్‌ స్థానంలో సూర్యకుమార్‌ యాద్‌వ్‌కు చోటు కల్పించారు.

బాధగా ఉంది .. భయ్యా..

వరల్డ్‌ కప్‌ జట్టులో చోటు దక్కకపోవడంతో నిరాశకు గురయ్యాడు శాంసన్‌. అయితే ‘ఏది జరగాలని ఉందో అదే జరిగింది! నేను మాత్రం ముందుకు సాగిపోవాలనే నిర్ణయించుకున్నాను’ అంటూ గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ ఇస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు శాంసన్‌. కాగా వర్షం కారణంగా టీమిండియా రెండు వార్మప్‌ మ్యాచ్‌లు పూర్తిగా రద్దైపోయాయి. దీంతో నేరుగా వరల్డ్‌ కప్‌లో అడుగుపెట్టనుంది భారత్‌. అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌ ఆడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ జరగనుంది.

ఇవి కూడా చదవండి

సంజూ శాంసన్ ఎమోషనల్ పోస్ట్..

రజనీ కాంత్ జైలర్ సినిమా సెలబ్రేషన్స్ లో సంజూ శాంసన్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..