AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC World Cup 2023: పుష్ప ‘శ్రీవల్లీ’ పాటకు డేవిడ్ వార్నర్ అదిరిపోయే స్టెప్పులు

ఉప్పల్ స్టేడియం వేదిక గా పాక్ ఆస్ట్రేలియా వమ్ ఆఫ్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.. పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అభిమానులకు డాన్స్ వేస్తూ ఉత్సాహపరిచారు. దీంతో స్టేడియం అంతా అరుపులు కేకలతో దద్దరిల్లింది.. స్టేడియంలో పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాట పెట్టగానే డేవిడ్ వార్నర్ ఆ పాటలోని హుక్ స్టెప్పును వేశారు. ఇక అంతే వార్నర్ అంటూ అరుస్తూ కేక పుట్టించారు. మూవీ రిలీజ్ అయినటువంటి కొత్తలో పుష్పాలోని శ్రీవల్లి..

ICC World Cup 2023: పుష్ప 'శ్రీవల్లీ' పాటకు డేవిడ్ వార్నర్ అదిరిపోయే స్టెప్పులు
Australian Cricketer David Warner
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Oct 03, 2023 | 10:03 PM

Share

హైదరాబాద్‌, అక్టోబర్‌ 3: ఉప్పల్ స్టేడియం వేదిక గా పాక్ ఆస్ట్రేలియా వమ్ ఆఫ్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.. పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అభిమానులకు డాన్స్ వేస్తూ ఉత్సాహపరిచారు. దీంతో స్టేడియం అంతా అరుపులు కేకలతో దద్దరిల్లింది.. స్టేడియంలో పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాట పెట్టగానే డేవిడ్ వార్నర్ ఆ పాటలోని హుక్ స్టెప్పును వేశారు. ఇక అంతే వార్నర్ అంటూ అరుస్తూ కేక పుట్టించారు. మూవీ రిలీజ్ అయినటువంటి కొత్తలో పుష్పాలోని శ్రీవల్లి పాటతో డాన్స్ వేసిన డేవిడ్ వార్నర్ తెలుగు ప్రేక్షకులకు క్రికెట్ అభిమానులకు మరింత దగ్గరయ్యారు. దీంతో మరోసారి ఉప్పల్ స్టేడియంలో ఈరోజు జరుగుతున్నటువంటి వామప్ మ్యాచ్లో శ్రీవల్లి పాట పెట్టగానే మరోసారి స్టెప్పులు వేశారు డేవిడ్ వార్నర్.

పుష్ప…. రికార్డ్స్ సృష్టించిన మూవీ టాలీవుడ్ నో రేంజ్కి తీసుకెళ్లినటువంటి సినిమా ఈ సినిమా ట్రైలర్ నుంచి మొదలుకుంటే పాటలు రిలీజ్ అయిన తర్వాత సినిమా ఆ తరువాత రికార్డ్స్ బద్దలు కొట్టేసింది. ఈ సినిమా సుకుమార్ డైరెక్షన్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా విలన్ పాత్రలో ఫహద్ ఫాసిల్ నటించారు. అయితే ఈ సినిమాలో తన నటస్వరూపాన్ని చూపించాడు. అల్లు అర్జున్ అతని నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును దక్కించుకున్నాడు. మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే ఈ అవార్డు వచ్చిన తర్వాత సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు అభిమానులు ఎంతో సంతోషానికి గురయ్యారు.

మొదటగా ఈ సినిమా నుంచి వచ్చినటువంటి పాటలు ఏ ఫంక్షన్ లో చూసిన ఎక్కడ చూసినా వినిపించాయి. అయితే చూపే బంగారమాయనే శ్రీవల్లి అని పాటలో హుక్ స్టెప్ ఏదైతే ఉందో ఆ స్టెప్పు మాత్రం దేశాలను దాటి ప్రతి ఒక్కరి చేత ఆ హుక్ స్టెప్పును వేసేలా చేసింది. ఆ దెబ్బకి మన తెలుగోడి సినిమా సత్తా ఎలా ఉంటుందో రుజువైంది. అయితే అదే పాటకి మరోసారి ఉప్పల్ స్టేడియంలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి మన పుష్ప మూవీ సాంగ్ శ్రీవల్లి అనే పాటకు స్టేడియం పిచ్చులోనే స్టెప్పులు వేశారు. దీంతోక్కడున్నటువంటి క్రికెట్ అభిమానులంతా కేకలు వేస్తూ ఎంజాయ్ చేశారు. అనంతరం డేవిడ్ వార్నర్ అభిమానుల వైపు చూసి నవ్వుతూ సిగ్నల్ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.