AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆయనో స్వార్థపరుడు.. మమ్మల్ని బానిసల్లా చేసేవాడు.. బూట్లు తుడవాలంటూ ఆర్డర్‌లు వేసేవాడు’

ఆ సమయంలో నాతో పాటు రమీజ్ రాజా, తాహిర్, మొహ్సిన్, షోయబ్ మహ్మద్ లాంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. నేను ఈ యువ ఆటగాళ్లతో కలిసి నైట్‌క్లబ్‌లకు వెళ్లినప్పుడు..

'ఆయనో స్వార్థపరుడు.. మమ్మల్ని బానిసల్లా చేసేవాడు.. బూట్లు తుడవాలంటూ ఆర్డర్‌లు వేసేవాడు'
Wasim Akram, Salim Malik
Venkata Chari
|

Updated on: Nov 28, 2022 | 9:36 PM

Share

పాకిస్థాన్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ తన సహచరుడు సలీం మాలిక్‌పై పలు కీలక ఆరోపణ చేశాడు. తాను పాకిస్థాన్‌కు ఆడటం ప్రారంభించినప్పుడు, సలీం మాలిక్ నన్ను సేవకుడిలా చూసేవాడని వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు. వసీం అక్రమ్ 1984లో పాకిస్థాన్ తరపున అరంగేట్రం చేశాడు. సలీం మాలిక్ పాకిస్థాన్ జట్టు సీనియర్ ఆటగాడు. వసీం అక్రమ్ తన ఆత్మకథ సుల్తాన్-ఇ మెమోయిర్ (సుల్తాన్: ఎ మెమోయిర్)లో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఆయనో స్వార్థపరుడు..

నా జూనియర్ అంటూ సలీం మాలిక్ పదేపదే సంభోదించేవాడంటూ వసీం అక్రమ్ తెలిపాడు. సలీం మాలిక్ నెగటివ్‌గా ఆలోచిచేంవాడు. స్వార్థపరుడు, చెడ్డ వ్యక్తి అంటూ విమర్శలు గుప్పించాడు. అతను నన్ను ఓ సేవకుడిలా చూసేవాడు. మసాజ్‌ చేయమంటూ నాకు ఆర్డర్లు ఇచ్చేవాడంటూ పేర్కొన్నాడు.

వసీం అక్రమ్ మాట్లాడుతూ.. ఆ సమయంలో నాతో పాటు రమీజ్ రాజా, తాహిర్, మొహ్సిన్, షోయబ్ మహ్మద్ లాంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. నేను ఈ యువ ఆటగాళ్లతో కలిసి నైట్‌క్లబ్‌లకు వెళ్లినప్పుడు, మాపై సలీమ్ మాలిక్‌ చాలా కోపం చూపించేవాడు.

ఇవి కూడా చదవండి

2000లో సలీం మాలిక్‌పై జీవితకాల నిషేధం..

వసీం అక్రమ్, సలీం మాలిక్ చాలా పర్యటనలలో సహచరులుగా ఉన్నారు. సలీం మాలిక్ 1992 నుంచి 1995 వరకు పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ పాకిస్థాన్ జట్టులో వసీం అక్రమ్ కూడా ఉన్నాడు. సలీమ్ మాలిక్ కెప్టెన్సీలో పాకిస్థాన్ 12 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 34 వన్డేల్లో 21 విజయాలు సాధించింది. అయితే, సలీం మాలిక్ 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా జీవితకాల నిషేధానికి గురయ్యాడు. అయితే సలీం మాలిక్‌పై వసీం అక్రమ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణ తర్వాత, వసీం అక్రమ్, సలీం మాలిక్ నిరంతరం వార్తల్లోనే నిలుస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..