- Telugu News Photo Gallery Cricket photos Vijay hazare trophy ruturaj gaikwad create world record break check these 5 big records
159 బంతుల్లో విధ్వంసం.. క్రికెట్ చరిత్రలోనే 5 భారీ రికార్డులకు బ్రేక్.. టీమిండియా యంగ్ ప్లేయర్ దూకుడు..
విజయ్ హజారే ట్రోఫీలో రితురాజ్ గైక్వాడ్ ఓ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు కొట్టి అద్భుత ప్రదర్శనతో టాక్ ఆఫ్ ది డేగా మారాడు.
Updated on: Nov 28, 2022 | 8:08 PM

విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రీతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. మహారాష్ట్రకు కెప్టెన్‌గా బరిలోకి దిగిన గైక్వాడ్ ఉత్తరప్రదేశ్‌పై అజేయంగా 220 పరుగులతో నిలిచాడు. ఈ సమయంలో అతను 159 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లు బాదాడు.

ఈ ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో 5 భారీ రికార్డులను గైక్వాడ్ బద్దలు కొట్టాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా సంయుక్తంగా నిలిచాడు. రోహిత్ ఒక ఇన్నింగ్స్‌లో 16 సిక్సర్లు కొట్టాడు.

49వ ఓవర్లో శివ సింగ్ బౌలింగ్‌లో గైక్వాడ్ 7 సిక్సర్లు బాదాడు. ఒక బ్యాట్స్‌మెన్ ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు బాదడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధికంగా 43 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా గైక్వాడ్ నిలిచాడు.

ఒక ఓవర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా గైక్వాడ్ నిలిచాడు. సోబర్స్, రవిశాస్త్రి, హెర్షెల్ గిబ్స్, యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్, తిసర పెరీరా, రాస్ వైట్లీ, జజాయ్ ఇలా వివిధ ఫార్మాట్లలో ఒకే ఓవర్‌లో వరుసగా 6 సిక్సర్లు బాదేశారు. ఈ విషయంలో గైక్వాడ్ వారికంటే ముందున్నాడు. వరుసగా 7 సిక్సర్లు కొట్టాడు.

విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా గైక్వాడ్ నిలిచాడు. గతేడాది క్వార్టర్ ఫైనల్స్‌లో కేరళపై 192 పరుగులు చేసిన కర్ణాటక ఆటగాడు ఆర్ సమర్థ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు.




