Sourav Ganguly: సచిన్-సెహ్వాగ్ మధ్య తేడా అదే.. మాజీ సారథి సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు..
గంగూలీ తన కెప్టెన్సీ సమయంలో భారత క్రికెట్‌లోని కొంతమంది భవిష్యత్ సూపర్‌స్టార్‌లను తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. అలాగే అతను సీనియర్లతోనూ చక్కగా వ్యవహరించాడు.
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అత్యుత్తమ సారథుల్లో ఒకడిగా పేరుగాంచాడు. ఎంతోమంది దిగ్గజాలతో ఆడాడు. స్వదేశంలో, విదేశాలలో టీమిండియాకు ఎన్నో గొప్ప విజయాలను అందించాడు. జట్టులోని యువకుల నుంచి అత్యుత్తమ ప్రదర్శనను పొందగలిగాడు. గంగూలీ తన కెప్టెన్సీ సమయంలో భారత క్రికెట్‌లోని కొంతమంది భవిష్యత్ సూపర్‌స్టార్‌లను తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. అలాగే అతను సీనియర్లతోనూ చక్కగా వ్యవహరించాడు. భారత అత్యుత్తమ ఓపెనర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి వారితో ఓపెనింగ్ చేసిన అనుభవం గురించి గంగూలీ ఇటీవల తన అభిప్రాయాన్ని పేర్కొన్నాడు.
ఓ వాణిజ్య కార్యక్రమంలో పాల్గొన్న గంగూలీ ఎన్నో విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా సచిన్ ఎంతో ప్రత్యేకమైన వాడంటూ కారణాలతో వివరించాడు. టెండూల్కర్‌ను తెలివైనవాడిగా పిలిచిన సౌరవ్.. సెహ్వాగ్‌ను మాత్రం బ్యాటర్‌గా మెంటల్ వాడంటూ చెప్పుకొచ్చాడు. ఇద్దరిలో మాజీ భారత కెప్టెన్ టెండూల్కర్‌ను ఎంచుకుని, ఎన్నో సంఘటనలను వెల్లడించాడు. సచిన్‌తో చాలాకాలం ఓపెనింగ్‌ను ఆస్వాదించాడు. మాస్టర్ బ్లాస్టర్‌తో బ్యాటింగ్ చేయడం తన ఆటను పెంచుకోవడానికి సహాయపడిందని చెప్పుకొచ్చాడు.
పక్కటెముక విరిగినా.. పరుగు ఆపలేదు..
మాజీ భారత కెప్టెన్ టెండూల్కర్‌తో ఓపెనింగ్ చేస్తున్న సమయంలో జరిగిన ఓ ఆసక్తికరమైన వృత్తాంతాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. సచిన్ ఎందుకు ప్రత్యేక క్రికెటర్ అయ్యాడో వివరించాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు టెండూల్కర్‌కి ఒకసారి పక్కటెముకలకు దెబ్బ తగిలిందని, రెండుచోట్ల ఫ్రాక్చర్ అయ్యింది. అయితే దాని గురించి పెద్దగా ఆందోళన చెందలేదని, విపరీతమైన నొప్పితో ఉన్నప్పటికీ పరుగులు తీయడం కొనసాగించాడని గంగూలీ వెల్లడించాడు.
“సచిన్ ప్రత్యేకమైనవాడు. నేను అతనిని చాలా దగ్గరగా చూశాను. అతను పక్కటెముకకు దెబ్బ తగలడం నేను చూశాను. అతను మాత్రం ఎలాంటి నొప్పిని ప్రదర్శించలేదు. పరుగులు చేశాడు. మరుసటి రోజు ఉదయం, అతని పక్కటెముకలలో రెండుచోట్ల ఫ్రాక్చర్ అయింది. నాకు మాత్రం శబ్దం వినిపించింది. నేను వెళ్లి బాగున్నావా అని అడిగాను. దానికి సచిన్ మాత్రం బాగానే ఉన్నాను అంటూ సమాధానం ఇచ్చాడు. మరుసటి రోజు ఉదయం స్కానింగ్‌లో రెండు ఫ్రాక్చర్లు ఉన్నాయని తేలింది. అందుకే అతను ప్రత్యేకంగా ఉంటాడు” అని గంగూలీ గుర్తు చేసుకున్నారు.
ఆల్ టైమ్ గ్రేటెస్ట్ బ్యాటర్‌లలో ఒకరైన టెండూల్కర్ ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు. టెండూల్కర్‌తో ఆడడం వల్ల నా ఆటను పెంచుకోడానికి సహాయపడిందని గంగూలీ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..