సెలక్షన్ కమిటీ తీరుపై బీసీసీఐ అసంతృప్తి.. రోహిత్, కోహ్లీ, ద్రవిడ్‌లపై దాడికి సిద్ధం.. సమీక్షా సమావేశం ఎప్పుడంటే?
ఈ సమావేశానికి జైషా అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో టీమ్ ఇండియా పేలవమైన ప్రదర్శనను బీసీసీఐ కార్యదర్శి జైషా సమీక్షించనున్నారు.
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైన టీమిండియాపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కలత చెందింది. స్పోర్ట్స్ పోర్టల్ ‘ఇన్‌సైడ్ స్పోర్ట్’ ప్రకారం- బీసీసీఐ త్వరలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతోందంట. ఈ సమావేశంలో కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలపై ప్రశ్నల వర్షం కురిపించేందుకు సిద్ధమైందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సమావేశానికి జైషా అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో టీమ్ ఇండియా పేలవమైన ప్రదర్శనను బీసీసీఐ కార్యదర్శి జైషా సమీక్షించనున్నారు. బోర్డు అధికారి తెలిపిన వివరాల ప్రకారం – మేం సమావేశం కాబోతున్నాం. ఈ సెమీ ఫైనల్ ఓటమి నుంచి మేం కూడా కోలుకోలేదు. సహజంగానే జట్టులో మార్పు అవసరం. సమీక్షలో జట్టు మాట వినడం కూడా ముఖ్యం. అది లేకుండా ఏ ఫలితాన్ని చేరుకోలేం. అందువల్ల, రోహిత్, ద్రవిడ్, కోహ్లీ ఇన్‌పుట్‌లను విన్న తర్వాత భవిష్యత్ టీ20 జట్టును ప్లాన్ చేస్తాం అని తెలిపారు.
ముప్పేట దాడికి సిద్ధమైన సెలక్షన్ కమిటీ..
మీడియా నివేదికల ప్రకారం- బీసీసీఐ కూడా సెలక్షన్ కమిటీ పనితీరుపై అసంతృప్తిగా ఉంది. సెలక్షన్ కమిటీ చీఫ్‌గా మాజీ ఫాస్ట్ బౌలర్ చేతన్ శర్మ ఉన్నారు. సెలక్షన్ కమిటీ పనితీరును కూడా సమావేశంలో సమీక్షించనున్నారు. సెలక్షన్ కమిటీ హెడ్ పదవి నుంచి చేతన్ శర్మను తొలగిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, చేతన్ స్వయంగా ఈ సమావేశంలో పాల్గొంటారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
2024 టీ20 ప్రపంచ కప్‌లో భారీగా మార్పులు..
తదుపరి టీ20 ప్రపంచ కప్ 2024 లో వెస్టిండీస్, యూఎస్‌ఏలో జరుగుతుంది. అప్పటికి చాలా మంది సీనియర్ ఆటగాళ్లు టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటారని బీసీసీఐ అభిప్రాయపడింది. బీసీసీఐ అధికారి మాట్లాడుతూ – మేం ఏ ఒక్క ఆటగాడి గురించి కాదు, మొత్తం జట్టు గురించి ఆలోచిస్తున్నాం. ఆటగాళ్ళు తమను తాము నిర్ణయించుకోవచ్చు. మేం క్రికెట్, టీమ్ ఇండియా గురించి ఆలోచిస్తున్నాం. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్స్, నాకౌట్ మ్యాచ్‌ల్లో టీమ్ ఇండియా ప్రదర్శన తర్వాత ఇవన్నీ ఆడగక తప్పదు. నాకౌట్ మ్యాచ్‌ల్లో టీమిండియా పేలవ ప్రదర్శనను నిరోధించేందుకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నాం అని తెలిపారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..