
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ హోరాహోరీగా జరుగుతోంది. ఈ హై వోల్టేజీ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించాలని కోట్లాది మంది అభిమానులు ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. ఇప్పటికే టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 80 పరుగులు సాధించింది. ఇదిలా ఉంటే మ్యాచ్‌కు ముందు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు, సచిన్ తన చివరి వన్డే మ్యాచ్‌లో ధరించిన జెర్సీని విరాట్ కోహ్లీకి బహుమతిగా ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2011లో భారత్ ప్రపంచకప్ గెలిచినప్పుడు సచిన్, విరాట్ ఇద్దరూ కలిసి ఆ జట్టులో ఆడారు. సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై విరాట్ కోహ్లీ 50వ సెంచరీని నమోదు చేశాడు. ఈ సెంచరీతో సచిన్ 49 సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సచిన్ కూడా ఉన్నాడు. విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్‌ల మధ్య మంచి అనుబంధం ఉంది. విరాట్ కూడా మాస్టర్ బ్లాస్టర్‌ని తన రోల్ మోడల్ అని పలు సందర్భాల్లో పేర్కొన్నాడు.
2023 ICC ODI ప్రపంచకప్‌లో ఇప్పుడు ఫైనల్ ఫైట్ జరుగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్, పాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్లు టైటిల్ కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. నేటి మ్యాచ్‌లో భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆస్ట్రేలియా కూడా సెమీఫైనల్‌లో ఆడిన ఆటగాళ్లనే ఫైనల్‌కు ఎంపిక చేసింది. కాగా ఇప్పటికే టీమిండియా 3 వికెట్లు కోల్పోయింది. రోహిత్, గిల్, శ్రేయస్ అయ్యర్ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరుకున్నారు.
Virat Kohli & Sachin Tendulkar 🫶❤️🔥#INDvsAUSfinal #Worldcupfinal2023 #CWC23Final #INDvsAUS #INDvAUS pic.twitter.com/K0MBuQHjyz
— Rahul Yaduvanshi (@Yadav100Rahul) November 19, 2023
ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.
సచిన్ జెర్సీతో కోహ్లీ..
Sachin Tendulkar presented Virat Kohli his signed Jersey ahead of the Final.
– Moment of the day…!!! pic.twitter.com/D1Y1JvPoqW
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 19, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..