AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SA vs SL Live Score, T20 World Cup 2021: ఉత్కంఠ మ్యాచులో దక్షిణాఫ్రికా విజయం.. సెమీస్ రేసు నుంచి లంక ఔట్..!

SA vs SL Live Score, T20 World Cup 2021 in Telugu: ప్రస్తుతం రెండు జట్లకు సమాన పాయింట్లతో ఉన్నాయి. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా టీం ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక టీం బ్యాటింగ్ చేస్తుంది.

SA vs SL Live Score, T20 World Cup 2021: ఉత్కంఠ మ్యాచులో దక్షిణాఫ్రికా విజయం.. సెమీస్ రేసు నుంచి లంక ఔట్..!
T20 World Cup 2021, Sa Vs Sl
Venkata Chari
|

Updated on: Oct 30, 2021 | 7:18 PM

Share

SA vs SL, T20 World Cup 2021: హోరాహోరీగా సాగిన ఈ మ్యాచులో దక్షిణాఫ్రికా టీం 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక విధించిన టార్గెట్‌ను మరో బంతి మిగిలి ఉండగా 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. దీంతో దక్షిణాఫ్రికా టీం సెమీస్ రేసులో తన ఆశలను సజీవంగా ఉంచుకుంది. శ్రీలంక మాత్రం తన సెమీస్ ఆశలను దాదాపుగా కోల్పోయింది. టీ20 ప్రపంచకప్ సూపర్ 12 మ్యాచ్‌లో ఈరోజు దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా టీం ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత శ్రీలంక బ్యాటింగ్ చేయనుంది. 20 ప్రపంచకప్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు డికాక్ అందుబాటులో ఉండనున్నాడు. డి కాక్ గురువారం ఒక ప్రకటన విడుదల చేయడంతో జాతి వివక్షపై మోకాళ్లపై కూర్చొని నిరసన తెలపడం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపాడు. దీంతో బోర్దుకు, డికాక్‌కు మధ్య విభేదాలు తొలిగిపోయాయి.

ఇరు జట్ల మధ్య జరిగిన గత 5 మ్యాచ్‌ల ఫలితాలను పరిశీలిస్తే.. మ్యాచ్ ఫలితం ఏకపక్షంగా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా 5 మ్యాచులతో తమ ఆధిక్యాన్ని చాటింది. ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరును పరిశీలిస్తే.. 16 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో దక్షిణాఫ్రికా 11 సార్లు విజయం సాధించింది. కాగా శ్రీలంక కేవలం 5 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.

దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ లైవ్ స్కోర్‌ను ఇక్కడ చూడండి

SA vs SL, T20 ప్రపంచ కప్ 2021, లైవ్ స్కోర్ వివరాలు:

# 18.4 ఓవర్లో  నిశాంక యొక్క అద్భుతమైన ఇన్నింగ్స్ కూడా ముగిసింది. నిశాంకను నోర్కియా పెవిలియన్ చేర్చాడు. నిశాంక 58 బంతుల్లో 72 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు.

# 19వ ఓవర్‌లో ప్రటోరియస్ రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. ఓవర్ రెండో బంతికి కరుణరత్నే వాన్ డెర్ చేతికి చిక్కాడు. కేవలం ఐదు బంతుల్లో ఐదు పరుగులు చేశాడు.

# తబ్రేజ్ షమ్సీ 14వ ఓవర్ బౌల్ చేశాడు. దాసున్ హస్రంగను పెవిలియన్ చేర్చాడు. హస్రంగ లాంగ్ ఆన్‌లో షాట్ ఆడి మాక్రంకు క్యాచ్ ఇచ్చాడు. ఐదు బంతుల్లో నాలుగు పరుగులు చేసి వెనుదిరిగాడు.

# 12వ ఓవర్ నాలుగో బంతికి అవిష్క ఫెర్నాండో కూడా రాజపక్సే బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అతను కూడా తబ్రేజ్ షమ్సీ బాధితుడిగా మారాడు. ఫెర్నాండో ఐదు బంతుల్లో మూడు పరుగులు మాత్రమే చేయగలిగాడు.

# 10వ ఓవర్ మూడో బంతికి రాజపక్సే తబ్రేజ్ షమ్సీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రాజపక్సే ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యారు.

# 9 ఓవర్లకు శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది.

# కేశనల్ మహరాజ్ ఎనిమిదో ఓవర్ బౌల్ చేశాడు. అతని మొదటి బంతికే అస్లాంక డీప్-మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ కొట్టాడు. ఆ ఓవర్ ఐదో బంతికి అస్లాంక రనౌట్ అయ్యాడు. 14 బంతుల్లో 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తన ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు.

# 7 ఓవర్లకు శ్రీలంక 1 వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది.

# 20 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. కుశాల్ పెరీరా 7 పరుగుల వద్ద నోకియా బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.

# దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక జట్టు ముందుగా బ్యాటింగ్‌కు దిగనుంది.

# వివాదం తర్వాత, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్  జట్టులోకి తిరిగి వచ్చాడు. ఈరోజు అతను ప్లేయింగ్ XIలో చోటు దక్కించుకున్నాడు.

# శ్రీలంక (ప్లేయింగ్ XI): కుసల్ పెరీరా(కీపర్), పాతుమ్ నిస్సాంక, చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్సే, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, లహిరు కుమార

# దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): టెంబా బావుమా(కెప్టెన్), క్వింటన్ డి కాక్(కీపర్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ