AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: టీమిండియాకు షాకింగ్ న్యూస్.. వన్డే సిరీస్ నుంచి వెటరన్ ప్లేయర్ ఔట్.. కారణం ఏంటంటే?

India vs South Africa: నవంబర్ 30న దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. మహ్మద్ షమీ ఎంపిక అతని ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది. షమీ చీలమండ నొప్పితో బాధపడుతున్నాడు. అయితే, అతను ప్రపంచ కప్‌లో తన పనిభారాన్ని సక్రమంగా నిర్వహించాడు. టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. అయితే, మహ్మద్ షమీ ఇంకా పూర్తి ఫిట్‌గా లేడు. ఈ కారణంగా మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భాగం కావడం లేదు.

IND vs SA: టీమిండియాకు షాకింగ్ న్యూస్.. వన్డే సిరీస్ నుంచి వెటరన్ ప్లేయర్ ఔట్.. కారణం ఏంటంటే?
Ind Vs Sa Odi Series
Venkata Chari
|

Updated on: Dec 16, 2023 | 11:27 AM

Share

IND vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే, టెస్టు సిరీస్‌లు ప్రారంభం కాకముందే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత జట్టు ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ (Deepak Chahar) వన్డే సిరీస్ నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు. కాగా మహ్మద్ షమీ (Mohd Shami) తొలి టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. షమీ ఇంకా పూర్తి ఫిట్‌గా లేడని, అందుకే తొలి మ్యాచ్‌లో ఆడలేనని తెలిపాడు.

దీపక్ చాహర్ గురించి మాట్లాడితే, అతను డిసెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌కు భారత జట్టులో భాగమయ్యాడు. అయితే కుటుంబంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా, అతను ఈ సిరీస్ నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు. దీపక్ చాహర్ స్థానంలో ఆకాశ్ దీప్‌ను భారత జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

తొలి టెస్టు మ్యాచ్‌కు మహ్మద్ షమీ ఔట్..

అదే సమయంలో, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కూడా డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే మొదటి బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. బీసీసీఐ ప్రకారం, షమీ ఇంకా పూర్తి ఫిట్‌గా లేడని, అందుకే అతను ఈ మ్యాచ్‌లో ఆడడం లేదని తెలిపింది.

నవంబర్ 30న దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. మహ్మద్ షమీ ఎంపిక అతని ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది. షమీ చీలమండ నొప్పితో బాధపడుతున్నాడు. అయితే, అతను ప్రపంచ కప్‌లో తన పనిభారాన్ని సక్రమంగా నిర్వహించాడు. టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. అయితే, మహ్మద్ షమీ ఇంకా పూర్తి ఫిట్‌గా లేడు. ఈ కారణంగా మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భాగం కావడం లేదు. అతని భర్తీని ప్రకటించలేదు. ఎందుకంటే, చాలా మంది బౌలర్లు ఇప్పటికే దక్షిణాఫ్రికాలో ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..