విధ్వంసం..10 బంతుల్లో 54 పరుగులు.. 3 ఫోర్లు 7 సిక్సర్లు.. ఎవరు ఈ బ్యాట్స్‌మెన్..?
Cricket News: ప్రస్తుతం ప్రపంచం మొత్తం క్రికెట్ వ్యాపించింది. ప్రతి దేశంలో క్రికెట్ లీగ్‌లు జరుగుతున్నాయి. ఆటగాళ్లు తమ ప్రతిభను చాటుతున్నారు. నేపాల్‌లో
Cricket News: ప్రస్తుతం ప్రపంచం మొత్తం క్రికెట్ వ్యాపించింది. ప్రతి దేశంలో క్రికెట్ లీగ్‌లు జరుగుతున్నాయి. ఆటగాళ్లు తమ ప్రతిభను చాటుతున్నారు. నేపాల్‌లో కూడా అలాంటి ఒక క్రికెట్ లీగ్ జరుగుతోంది. దీని పేరు ఎవరెస్ట్ ప్రీమియర్ లీగ్. ఈ లీగ్‌లో ఖాట్మండు కింగ్స్ ఎలెవన్, లలిత్‌పూర్ పేట్రియాట్స్ మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. ఇందులో ఖాట్మండు కింగ్స్ ఎలెవన్ బ్యాట్స్‌మన్ 10 బంతుల్లో 54 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లలిత్‌పూర్ పేట్రియాట్స్‌కి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కుశాల్ భుర్తెల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు దారిపట్టాడు. తర్వాత వెంటనే రెండో వికెట్ పడిపోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన పవన్ సర్రాఫ్ 44 బంతుల్లో 64, యోగేంద్ర సింగ్ 20 బంతుల్లో 33 పరుగులు చేసి లలిత్‌పూర్ పేట్రియాట్స్‌ని 20 ఓవర్లలో 157 పరుగులకు చేర్చారు. ఖాట్మండు కింగ్స్ ఎలెవన్ తరపున జితేంద్ర ముఖియా నాలుగు వికెట్లు తీశాడు.
విధ్వంసం సృష్టించిన జింబాబ్వే ఆటగాడు 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఖాట్మండు కింగ్స్ ఎలెవన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సుభాష్ ఖకురేలి ఖాతా తెరవకుండానే రనౌట్ అయ్యాడు. రెండో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 36 బంతుల్లో 59 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ర్యాన్ బర్లే విధ్వంసం సృష్టించాడు. ర్యాన్ బర్లే జింబాబ్వే క్రికెటర్ అతను ఈ లీగ్‌లో ఖాట్మండు కింగ్స్ ఎలెవన్ తరఫున ఆడుతున్నాడు. అతను 2017 ఫిబ్రవరిలో జింబాబ్వే కోసం అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
10 బంతుల్లో 54 పరుగులు ర్యాన్ 34 బంతుల్లో 73 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అతను తన ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, ఏడు సిక్సర్లు కొట్టాడు. ఈ విధంగా అతను 10 బంతుల్లో కేవలం బౌండరీల సాయంతో 54 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ ఆధారంగా ఖాట్మండు కింగ్స్ ఎలెవన్ 14.2 ఓవర్లలో 160 పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది. ర్యాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.