Highlights of IPL Match Result, DC vs RR: ఢిల్లీకి ఎదురే లేదు.. రాజస్థాన్‌పై 33 పరుగుల తేడాతో ఘన విజయం

DC vs RR: తక్కువ స్కోరే చేసినా.. ఢిల్లీ బౌలర్ల అద్భుత ప్రతిభతో రాజస్థాన్ రాయల్స్‌ బ్యాట్స్‌మెన్స్‌ను కోలుకోకుండా చేశారు. దీంతో ఆర్‌ఆర్‌ టీంపై 33 పరుగుల తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో మరలా టాప్ ప్లేస్‌కు చేరుకుంది.

Highlights of IPL Match Result, DC vs RR: ఢిల్లీకి ఎదురే లేదు.. రాజస్థాన్‌పై  33 పరుగుల తేడాతో ఘన విజయం
Ipl 2021 Dc Vs Rr
Follow us

|

Updated on: Sep 25, 2021 | 7:26 PM

Highlights of IPL Match Result, DC vs RR: ఐపీఎల్ 2021లో భాగంగా 36 వ మ్యాచులో భాగంగా నేడు అబుదాబిలో జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్‌ టీం రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తక్కువ స్కోరే చేసినా.. ఢిల్లీ బౌలర్ల అద్భుత ప్రతిభతో రాజస్థాన్ రాయల్స్‌ బ్యాట్స్‌మెన్స్‌ను కోలుకోకుండా చేశారు. దీంతో ఆర్‌ఆర్‌ టీంపై 33 పరుగుల తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో మరలా టాప్ ప్లేస్‌కు చేరుకుంది.

155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ టీం వెంట వెంటనే వికెట్లను కోల్పోయి పరాజయం పాలైంది. లివింగ్ స్టోన్ 1, జైస్వాల్ 5, డేవిడ్ మిల్లర్ 7, మహిపాల్ 19, రియాన్ పరాగ్ 2 తక్కువ పరుగులకే పెవిలియన్ చేరి నిరాశపరిచారు. శాంసన్ ఒక్కడే (70 పరుగులు, 53 బంతులు, 8 ఫోర్లు, సిక్స్) ఒక్కడే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లలో అనిరిచ్ 2 వికెట్లు, అవేష్ ఖాన్, అశ్విన్, రబాడా, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ టీం ముందు 155 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షాలు ఇద్దరూ మంచి భాగస్వామ్యాలు నెలకొల్పారు. అయితే ఈ మ్యాచులో మాత్రం తొలి పవర్ ప్లే లోపే ఢిల్లీ టీం ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. అయితే, చరిత్ర ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ టీం పవర్ ప్లేలో రెండు వికట్లు కోల్పోయిన మ్యాచులో ఇంతవరకు గెలవకపోవడం విశేషం. మరి ఈ మ్యాచులో ఏం జరగనుందో చూడాలి.

తొలి పవర్ ప్లే అంటే 6 ఓవర్లు ముగిసేలోపు రాజస్థాన్ బౌలర్లు ఢిల్లీ బ్యాట్స్‌మెన్లపై పూర్తి ఆధిక్యం ప్రదర్శించారు. ఢిల్లీ టీం 2 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది. ఇందులో ఢిల్లీ టీం కేవలం మూడు ఫోర్లు కొట్టడం గమనార్హం. 3.1 ఓవర్లో శిఖర్ ధావన్ (11) రూపంలో ఢిల్లీ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో టీం స్కోర్ 18 వద్ద బౌల్డయ్యాడు. అనంతరం 4.1 ఓవర్లో పృథ్వీ షా (10) రూపంలో రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. చేతన్ సకారియా బౌలింగ్‌లో టీం స్కోర్ 21 వద్ద లివింగ్ స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

అనంతరం క్రీజులో ఉన్న రిషబ్ పంత్(24 పరుగులు, 24 బంతులు, 2 ఫోర్లు), శ్రేయాస్ అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్ టీంకు కీలకమైన 62 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం రిషబ్ పంత్ (24) ముస్తఫిజర్ బౌలింగ్‌లో టీం స్కోర్ 83 వద్ద బౌల్డయ్యాడు. 13.2 ఓవకంలొ శ్రేయాస్ అయ్యర్ (43 పరుగులు, 32 ఓవర్లు, 1 ఫోర్, 2 సిక్సర్లు) 4వ వికెట్‌గా వెనుదిరిగాడు. రాహుల్ తివాటియా బౌలింగ్‌లో టీం స్కోర్ 90 పరుగుల వద్ద శాంసన్ స్టంపింగ్ చేయడంతో పెవిలియన్ చేరాడు.

హిట్ మెయర్(28 పరగులు, 16 బంతులు, 5ఫోర్లు) ధాటిగా ఆడుతున్న క్రమంలో ముస్తఫిజుర్ బౌలింగ్‌లో టీం స్కోర్ 121 పరుగుల వద్ద చేతన్ సకారియాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. క్రీజులో ఉన్నంత సేపు బౌలర్లకు చుక్కలు చూపించాడు. 175 స్ట్రైక్‌ రేట్‌తో బ్యాటింగ్ చేసి అబుదాబిని షేక్ చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్స్ అక్షర్ పటేల్ 12, లలిత్ యాదవ్ 14 నాటౌట్, అశ్విన్ 6 నాటౌట్‌గా నిలిచారు.

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో రహమాన్, సకారియా తలో రెండు వికెట్లు, కార్తీక్ త్యాగి, రాహుల్ తివాటియా తలో వికెట్ పడగొట్టారు.

Also Read: DC vs RR, IPL 2021: ఢిల్లీని తక్కువ స్కోర్‌కే కట్టడి చేసిన ఆర్‌ఆర్ బౌలర్లు.. రాజస్థాన్ టార్గెట్ 155

IPL 2021, DC vs RR: రికార్డులకు ఒక అడుగు దూరంలో అశ్విన్, శాంసన్.. అవేంటంటే?