హోరాహోరీ మ్యాచ్‌లో కోల్‌కతాపై బెంగళూరు విజయం
ఐపీఎల్ 2019లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎట్టకేలకి రెండో విజయాన్ని అందుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి (100: 58 బంతుల్లో 9×4, 4×6) మెరుపు శతకం బాదడంతో బెంగళూరు జట్టు 10 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. కోహ్లితో పాటు మొయిన్ అలీ (66: 28 బంతుల్లో 5×4, 6×6) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు […]

ఐపీఎల్ 2019లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎట్టకేలకి రెండో విజయాన్ని అందుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి (100: 58 బంతుల్లో 9×4, 4×6) మెరుపు శతకం బాదడంతో బెంగళూరు జట్టు 10 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. కోహ్లితో పాటు మొయిన్ అలీ (66: 28 బంతుల్లో 5×4, 6×6) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 213 పరుగులు చేయగా.. ఛేదనలో నితీశ్ రాణా (85 నాటౌట్: 46 బంతుల్లో 9×4, 5×6), ఆండ్రీ రసెల్ (65: 25 బంతుల్లో 2×4, 9×6) చెలరేగి కోల్‌కతా జట్టులో ఆశలు రేపారు. కానీ.. ఆఖర్లో పుంజుకున్న బెంగళూరు బౌలర్లు ఎట్టకేలకి ఆ జట్టుని 203/5 కే పరిమితం చేశారు. ఈ సీజన్‌లో బెంగళూరుకి ఇది రెండో గెలుపుకాగా.. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ కోల్‌కతా ఓడిపోయింది.