AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉత్కంఠపోరులో రాయల్స్ అద్భుత విజయం

ఐపీఎల్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్స్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. రహానే, బట్లర్‌లు కలిసి తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించారు. అయితే కృనాల్ పాండ్యా వేసిన 7వ ఓవర్ రెండో బంతికి రహానే(37) […]

ఉత్కంఠపోరులో రాయల్స్ అద్భుత విజయం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 13, 2019 | 7:55 PM

Share

ఐపీఎల్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్స్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. రహానే, బట్లర్‌లు కలిసి తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించారు. అయితే కృనాల్ పాండ్యా వేసిన 7వ ఓవర్ రెండో బంతికి రహానే(37) సూర్యకుమార్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఈ దశలో బట్లర్ చెలరేగిపోయాడు. సంజూ శాంసన్‌తో కలిసి రెండో వికెట్‌కి 87 పరుగులు జోడించాడు. అయితే రాహుల్ చాహర్ వేసిన 14వ ఓవర్ రెండో బంతికి బట్లర్(89) భారీ షాట్‌కు ప్రయత్నించి సూర్యకుమార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత శాంసన్(31) బుమ్రా వేసిన 17వ ఓవర్ ఐదో బంతికి ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. ఆ తర్వాత రాజస్థాన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే చివరి వరకూ పోరాడి రాయల్స్ 19.3 ఓవర్లలో 188 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.

డయాబెటిస్‌ రోగులు ఆహారంలో వీటిని తీసుకుంటే.. సమస్యలు పరార్!
డయాబెటిస్‌ రోగులు ఆహారంలో వీటిని తీసుకుంటే.. సమస్యలు పరార్!
5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
2026లో ఇన్వెస్టర్లకు పండగే.. మీ అదృష్టాన్ని మార్చే కీలక రంగాలు..
2026లో ఇన్వెస్టర్లకు పండగే.. మీ అదృష్టాన్ని మార్చే కీలక రంగాలు..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?