RCB vs CSK, IPL 2024: లెక్క సరిచేసిన ఆర్సీబీ.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన బెంగళూరు

|

May 19, 2024 | 12:37 AM

Royal Challengers Bengaluru vs Chennai Super Kings: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. సీజన్ ప్రారంభంలో వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరైన ఆ జట్టు గోడకు కొట్టిన బంతిలా దూసుకొచ్చింది. వరుస విజయాలతో ఏకంగా ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లింది.

RCB vs CSK, IPL 2024: లెక్క సరిచేసిన ఆర్సీబీ.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన బెంగళూరు
Royal Challengers Bengaluru
Follow us on

Royal Challengers Bengaluru vs Chennai Super Kings: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. సీజన్ ప్రారంభంలో వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరైన ఆ జట్టు గోడకు కొట్టిన బంతిలా దూసుకొచ్చింది. వరుస విజయాలతో ఏకంగా ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లింది. శనివారం (మే 18) చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ప్లే ఆఫ్ బెర్తును ఖరారు చేసుకుంది.  ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. కెప్టెన్‌ డుప్లెసిస్‌ ( 39 బంతుల్లో 54, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లీ (29 బంతుల్లో 47,  3 ఫోర్లు, 4 సిక్స్‌లు), రజత్‌ పటీదార్‌ (23 బంతుల్లో 41,  2 ఫోర్లు, 4 సిక్స్‌లు), కామెరూన్‌ గ్రీన్‌ ( 17 బంతుల్లో 38,  3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి ఆడారు. ఆ తర్వాత భారీ స్కోరును ఛేదించేందుకు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేసింది.  ఆ జట్టులో రచిన్‌ రవీంద్ర (37 బంతుల్లో 61.  5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో అలరించగా, రవీంద్ర జడేజా (42 నాటౌట్), అజింక్య రహానె ( 22 బంతుల్లో33.  3 ఫోర్లు, 1 సిక్స్‌), ధోనీ (25) మెరుపులు మెరిపించినా ప్రయోజనం లేకుండా పోయింది

 

ఇవి కూడా చదవండి

కీలక సమయంలో చెన్నై త్వరత్వరగా వికెట్లు కోల్పోవడం, లక్ష్యం మరీ పెద్దది కావడంతో ధోని జట్టుకు ఓటమి తప్పలేదు. బెంగళూరు బౌలర్లలో యశ్‌ దయాల్‌ రెండు వికెట్లు తీయగా, మాక్స్‌వెల్‌, సిరాజ్‌, ఫెర్గూసన్‌, కామెరూన్‌ గ్రీన్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

ఆర్సీబీ ఆటగాళ్ల సంబరాలు.. వీడియో

 

 

 

 

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్, మహేశ్ తీక్షణ

ఇంపాక్ట్  ప్లేయర్లు: 

శివమ్ దూబే, సమీర్ రిజ్వీ, ప్రశాంత్ సోలంకి, షేక్ రషీద్, ముఖేష్ చౌదరి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):

ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్

ఇంపాక్ట్  ప్లేయర్లు: 

స్వప్నిల్ సింగ్, అనుజ్ రావత్, సుయాష్ ప్రభుదేశాయ్, విజయ్‌కుమార్ వైషాక్, హిమాన్షు శర్మ

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..