RR vs RCB, IPL 2021: చివర్లో తడబడిన రాజస్థాన్.. బెంగుళూర్ లక్ష్యం 150 పరుగులు
RR vs RCB, IPL 2021: ఐపిఎల్ 2021లో భాగంగా ఈ రోజు దుబాయ్‌లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి

RR vs RCB, IPL 2021: ఐపిఎల్ 2021లో భాగంగా ఈ రోజు దుబాయ్‌లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో టాస్ గెలిచిన బెంగుళూర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ 20 ఓవర్లకు 149 పరుగులు చేసింది. ఓపెనర్లుగా క్రీజులోకి అడగుపెట్టిన యశస్వి జైశ్వాల్, ఈవెన్ లూయిస్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు.
తొలి వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ముఖ్యంగా ఈవెన్ లూయిస్ బెంగుళూర్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ఈ క్రమంలో 31 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. (3 సిక్స్‌లు, 5 ఫోర్లు ఉన్నాయి) జార్జ్ బౌలింగ్‌లో 58 పరుగుల వద్ద ఔటయ్యాడు. యశస్వి జైశ్వాల్ 31 పరుగులతో అతడికి చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరు ఔటైన తర్వాత ఎవ్వరూ క్రీజులో నిలదొక్కకోలేకపోయారు.
కెప్టెన్ సంజ్ శాంసన్ 19 పరుగులు మినహాయించి ఎవ్వరూ పెద్దగా స్కోరు చేయలేకపోయారు. మరోవైపు బెంగుళూరు బౌలర్లు చెలరేగిపోయారు. వరుసగా వికెట్లు తీస్తూ రాజస్థాన్ ని కోలుకోలేని దెబ్బకొట్టారు. ఈ క్రమంలో రాజస్థాన్ 9 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. బెంగుళూర్‌కి 150 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. బెంగుళూర్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు, షహబాజ్ అహ్మద్ 2, యజ్వేంద్ర చాహల్ 1 వికెట్ సాధించారు.



