PL 2024: కోహ్లీ టీమ్‌లోకి స్టార్‌ ఆల్‌రౌండర్‌.. డేంజరస్‌ బౌలర్‌ స్థానంలో జట్టులోకి ఎంట్రీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌ కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. మార్చి 22 నుండి ఈ ధనాధన్‌ లీగ్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే అంతకంటే ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఇంగ్లిష్ స్టార్‌ ప్లేయర్ రీస్ టోప్లీ ఐపీఎల్‌ 2024కు దూరం..

PL 2024: కోహ్లీ టీమ్‌లోకి స్టార్‌ ఆల్‌రౌండర్‌.. డేంజరస్‌ బౌలర్‌ స్థానంలో జట్టులోకి ఎంట్రీ
Royal Challengers Bangalore
Follow us
Basha Shek

|

Updated on: Feb 13, 2024 | 10:33 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌ కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. మార్చి 22 నుండి ఈ ధనాధన్‌ లీగ్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే అంతకంటే ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఇంగ్లిష్ స్టార్‌ ప్లేయర్ రీస్ టోప్లీ ఐపీఎల్‌ 2024కు దూరం కానున్నట్లు సమాచారం. గాయం సమస్య కారణంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఫ్రాంచైజీ లీగ్ క్రికెట్ ఆడవద్దని రీస్ టాప్లీకి సూచించింది. అందుకే పాకిస్థాన్ సూపర్ లీగ్‌కు దూరమయ్యారు. దీని తర్వాత ఐపీఎల్‌లో ఆడేందుకు టోప్లీకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రావడం అనుమానమేనని అంటున్నారు. ఇప్పుడు టాప్లీకి బదులు మరో ప్లేయర్‌ని ఆర్సీబీ ఎంపిక చేసినట్లు తెలిసింది. ప్రస్తుత సమాచారం ప్రకారం, రీస్ టాప్లీ స్థానంలో క్రిస్ జోర్డాన్‌ను RCB ఫ్రాంచైజీ ఎంపిక చేసింది. దీని ప్రకారం ఐపీఎల్ సీజన్-17లో ఇంగ్లండ్ ప్లేయర్ జోర్డాన్ ఆర్సీబీ తరఫున ఆడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఐపీఎల్ వేలంలో క్రిస్ జోర్డాన్ రూ.1.50 కోట్లు పలికాడు. అయితే, ఏ ఫ్రాంచైజీ అతనిని కొనుగోలు చేసేందుకు సుముఖంగా లేదు. ఇప్పుడు జోర్డాన్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా మళ్లీ ఐపీఎల్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు.

ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. క్రిస్ జోర్డాన్ 2016లో RCB తరపున ఆడాడు. మొత్తం 9 మ్యాచ్ లు ఆడి 12 వికెట్లు తీశాడు. అయితే 2017లో RCB జోర్డాన్‌కు ఉద్వాసన పలికింది. ఆ తర్వాత 2017, 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బరిలోకి దిగాడు. 2019లో డ్రాఫ్ట్ లేకుండా వెళ్లిన జోర్డాన్, 2020, 2021లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. 2022లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు. అలాగే, 2023లో జోఫ్రా ఆర్చర్ స్థానంలో ముంబై ఇండియన్స్ జట్టుకు ఎంపికయ్యాడు. ఇప్పుడు క్రిస్ జోర్డాన్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా ఆర్‌సిబి జట్టులోకి అడుగుపెట్టనున్నాడని సమాచారం.

ఇవి కూడా చదవండి

టోప్లీ స్థానంలో జోర్డాన్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..