IND vs ENG: చిక్కుల్లో పాక్‌ సంతతి ఇంగ్లండ్‌ ప్లేయర్‌.. ఎయిర్‌ పోర్టులో అడ్డుకున్న అధికారులు.. కారణమిదే

మూడో టెస్టు మ్యాచ్‌ కోసం ఇంగ్లండ్‌ జట్టు అబుదాబి నుంచి భారత్‌కు తిరిగి వచ్చింది. రెండో టెస్టులో టీమిండియా చేతిలో ఓడిపోయిన ఇంగ్లిష్ జట్టు ప్రాక్టీస్ కోసం అబుదాబి వెళ్లింది. మూడో టెస్టు ప్రారంభమయ్యే సమయం కావడంతో, స్టోక్స్ అండ్ కో భారత్‌లో అడుగుపెట్టింది.

IND vs ENG: చిక్కుల్లో పాక్‌ సంతతి ఇంగ్లండ్‌ ప్లేయర్‌.. ఎయిర్‌ పోర్టులో అడ్డుకున్న అధికారులు.. కారణమిదే
Rehan Ahmed
Follow us

|

Updated on: Feb 13, 2024 | 9:18 AM

మూడో టెస్టు మ్యాచ్‌ కోసం ఇంగ్లండ్‌ జట్టు అబుదాబి నుంచి భారత్‌కు తిరిగి వచ్చింది. రెండో టెస్టులో టీమిండియా చేతిలో ఓడిపోయిన ఇంగ్లిష్ జట్టు ప్రాక్టీస్ కోసం అబుదాబి వెళ్లింది. మూడో టెస్టు ప్రారంభమయ్యే సమయం కావడంతో, స్టోక్స్ అండ్ కో భారత్‌లో అడుగుపెట్టింది. మూడు టెస్టుకు వేదికైన రాజ్‌కోట్‌కు తిరిగి వచ్చింది. అక్కడ ఫిబ్రవరి 15 నుండి టెస్ట్ సిరీస్‌లో మూడవ మ్యాచ్ జరగనుంది. అయితే భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఓ ఇంగ్లండ్ ఆటగాడితో మళ్లీ సమస్య వచ్చి పడింది. వీసాలో సమస్యలు ఉండడంతో విమానాశ్రయం అధికారులు అతనిని అడ్డుకున్నారు. పాకిస్థాన్‌ మూలాలున్న ఇంగ్లాండ్ ఆటగాడు రెహాన్ అహ్మద్‌ను రాజ్‌కోట్‌లో విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నారు. అహ్మద్‌కు సింగిల్ ఎంట్రీ వీసా ఉండడమే దీనికి కారణం. దీంతో చాలా సేపు అహ్మద్‌ ఎయిర్‌ పోర్టులోనే ఉండిపోయారు. పలు దఫాల చర్చల తర్వాత కానీ రెహాన్‌ అహ్మద్ ఇంగ్లండ్ క్రికెట్ జట్టుతో అహ్మద్‌కు హోటల్‌కు వెళ్లడానికి అనుమతి లభించలేదు. హోట్‌ల్‌కు వెళ్లేందుకు పర్మిషన్‌ లభించిన ఈ విషయం ఇంకా పరిష్కారం కాలేదు. నివేదికల ప్రకారం, రాజ్‌కోట్ విమానాశ్రయం నుండి హోటల్‌కు బృందంతో పాటు వెళ్లేందుకు రెహాన్ అహ్మద్ అనుమతి పొందారు. కానీ, 24 గంటల కాలపరిమితితో. వారి పేపర్లను సరిచేసుకోవడానికి ఈ 24 గంటల సమయం ఇచ్చారు. రాజ్‌కోట్‌లో మూడో టెస్టు ప్రారంభం కావడానికి ముందే ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ ఈ పని చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రెహాన్ వీసాను పునరుద్ధరించాల్సిందిగా ఇంగ్లండ్ జట్టును కోరినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. వారు ఈ పనిని రెండు రోజుల్లో పూర్తి చేయాలి. అప్పటి వరకు, లెగ్ స్పిన్నర్‌కు మిగతా జట్టుతో పాటు భారత్‌లో ఉండటానికి అనుమతి ఉంది. మంగళవారం జరిగే ప్రాక్టీస్‌లో అతను కూడా జట్టులో భాగం కానున్నాడు. భారత పర్యటనలో ఇంగ్లండ్ జట్టు వీసాకు సంబంధించిన సమస్యలు ఎదురుకావడం ఇది రెండోసారి. ఇంతకుముందు షోయబ్ బషీర్ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. వీసా పత్రాలు అసంపూర్తిగా ఉండడంతో బషీర్ కూడా తన బృందంతో కలిసి ఇండియాకు రాకపోవడంతో వారం ఆలస్యంగా భారత్ చేరుకున్నాడు. ఈ కారణంగానే అతను హైదరాబాద్‌లో జరిగిన సిరీస్‌లో మొదటి టెస్టులో కాకుండా విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో అరంగేట్రం చేశాడు. ఇక ఇప్పుడు రెహాన్ అహ్మద్ కూడా వీసా సమస్యతో చిక్కుల్లో పడ్డాడు.

ఇంగ్లండ్ టెస్ట్ జట్టు:

జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫాక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్, మార్క్ వుడ్, ఆలీ రాబిన్సన్, డేనియల్ లారెన్స్, గుస్ అట్కిన్సన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

మెట్రో రైలులోకి రైతుకు నో ఎంట్రీ.. వీడియో వైరల్
మెట్రో రైలులోకి రైతుకు నో ఎంట్రీ.. వీడియో వైరల్
రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. LRS దరఖాస్తులపై కీలక నిర్ణయం
రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. LRS దరఖాస్తులపై కీలక నిర్ణయం
అమ్మో..! విహారంలో నిర్లక్ష్యం.. యాత్రికుల ప్రాణాలకు భద్రతేది..?
అమ్మో..! విహారంలో నిర్లక్ష్యం.. యాత్రికుల ప్రాణాలకు భద్రతేది..?
మెట్రోలో ఆగని అరాచకాలు.. ఈ సారి ఓ అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే ..
మెట్రోలో ఆగని అరాచకాలు.. ఈ సారి ఓ అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే ..
42 ఏళ్ల వ్యక్తిపై ఎద్దు దాడి.. ఆస్పత్రికి తరలించే లోపే మృతి
42 ఏళ్ల వ్యక్తిపై ఎద్దు దాడి.. ఆస్పత్రికి తరలించే లోపే మృతి
ఒకే రోజు మూడుసార్లు బాద్షా పెళ్లి.! అర్హపాప క్యూట్ స్టెప్స్..
ఒకే రోజు మూడుసార్లు బాద్షా పెళ్లి.! అర్హపాప క్యూట్ స్టెప్స్..
టెక్నాలజీ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలి - కేంద్ర మంత్రి
టెక్నాలజీ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలి - కేంద్ర మంత్రి
WTC ఫైనల్ రేసు నుంచి ఇంగ్లండ్ ఔట్.. టీమిండియా ఏ స్థానంలో ఉందంటే?
WTC ఫైనల్ రేసు నుంచి ఇంగ్లండ్ ఔట్.. టీమిండియా ఏ స్థానంలో ఉందంటే?
మేడారం జాతరలో యువ ఐపీఎస్ రికార్డ్
మేడారం జాతరలో యువ ఐపీఎస్ రికార్డ్
కారు స్టీరింగ్‌ పట్టుకుని...సైకిల్‌ తొక్కుతున్న బుడ్డొడి స్టైల్‌!
కారు స్టీరింగ్‌ పట్టుకుని...సైకిల్‌ తొక్కుతున్న బుడ్డొడి స్టైల్‌!
టెక్నాలజీ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలి - కేంద్ర మంత్రి
టెక్నాలజీ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలి - కేంద్ర మంత్రి
శ్రీశైలంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఏసీబీ అధికారులు..
శ్రీశైలంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఏసీబీ అధికారులు..
వికసిత్‌ భారత్‌లో నారీశక్తి కీలకం - స్మృతి ఇరానీ
వికసిత్‌ భారత్‌లో నారీశక్తి కీలకం - స్మృతి ఇరానీ
చంద్రబాబుని నాయకుడిగా కంటే దేవుడిగానే చూస్తా- బుద్ధా వెంకన్న
చంద్రబాబుని నాయకుడిగా కంటే దేవుడిగానే చూస్తా- బుద్ధా వెంకన్న
వాట్ ఇండియా థింక్స్ టుడే.. మొదటి రోజు హైలైట్స్ వీడియో
వాట్ ఇండియా థింక్స్ టుడే.. మొదటి రోజు హైలైట్స్ వీడియో
మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది
మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది
అలా చెప్పేవారిని చెప్పుతో కొట్టండి.. బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
అలా చెప్పేవారిని చెప్పుతో కొట్టండి.. బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
50 ఏళ్ల తర్వాత చంద్రుడి పై దిగిన అమెరికా అంతరిక్ష నౌక.
50 ఏళ్ల తర్వాత చంద్రుడి పై దిగిన అమెరికా అంతరిక్ష నౌక.
ఈ పండు తింటే కిడ్నీలో రాళ్లు మాయం.! ఇప్పుడు మన దగరకూడా..
ఈ పండు తింటే కిడ్నీలో రాళ్లు మాయం.! ఇప్పుడు మన దగరకూడా..
నాగార్జున సాగర్‌లో పర్యాటకులకు కనువిందుగా అరుదైన నీటికుక్కల సందడి
నాగార్జున సాగర్‌లో పర్యాటకులకు కనువిందుగా అరుదైన నీటికుక్కల సందడి