TV9 Telugu
25 July 2024
పారిస్ ఒలింపిక్స్ 2024 జులై 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో మొత్తం 204 దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారు.
1896లో ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. ఈ గేమ్‌లలో, ప్రతి క్రీడాకారుడు బంగారు పతకం గెలవాలని కలలు కంటాడు.
అయితే ఈ గేమ్‌లలో ఇద్దరు ఆటగాళ్లకు కలిపి బంగారు పతకాలు అందించిన సందర్భం ఉంది.
టోక్యో ఒలింపిక్స్ 2020 సందర్భంగా హైజంప్ ఈవెంట్‌లో ఇద్దరు అథ్లెట్ల మధ్య బంగారు పతకాన్ని విభజించినప్పుడు ఈ ప్రత్యేకమైన సంఘటన కనిపించింది.
హైజంప్ ఈవెంట్‌లో ఖతార్‌కు చెందిన అథ్లెట్ ముతాజ్ ఎస్సా బర్షిమ్, ఇటలీకి చెందిన జియాన్‌మార్కో టాంబెరి మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఈ క్రమంలో న్యాయ నిర్ణేతలు ఇద్దరినీ విజేతగా ప్రకటించారు. దీంతో ఈ ఇద్దరు ఆటగాళ్లకు బంగారు పతకం లభించింది. ఈ ఆటగాళ్లు స్వర్ణాన్ని పంచుకున్నారు.
ఇద్దరు అథ్లెట్ల మధ్య బంగారు పతకాన్ని పంచుకున్నందున, పురుషుల హైజంప్ ఈవెంట్‌లో రజత పతకం ఎవరికీ ఇవ్వలేదు.
దీంతో ఆ ఏడాది ఒలింపిక్స్‌లో స్వర్ణం తర్వాత నేరుగా కాంస్య పతకం లభించింది. అంటే, రజత పతకం బదులుగా గోల్డ్ మెడల్ అందించారు.