22 July 2024
TV9 Telugu
Pic credit - GETTY
ప్రతి క్రీడాకారుడు ఒలింపిక్స్‌లో ఆడాలని కలలు కంటాడు. భారతదేశంలోని కొంతమంది అథ్లెట్లు ఈ కలను చాలాసార్లు నిజం చేసుకున్నారు.
భారత దేశం తరపున అత్యధిక ఒలింపిక్స్ ఆడిన ఆటగాడు లియాండర్ పేస్. అతను 7 సార్లు ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొన్నాడు. డబుల్స్ లో కాంస్య పతకం గెలుచుకున్నాడు.
అభినవ్ బింద్రా 4 ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొన్నాడు. అతను 2004, 2008, 2012, 2016లో జరిగిన ఒలింపిక్స్ లో భారత్ కు ప్రాతినిద్యం వహించాడు. దేశానికి పసిడి పతకం అందించాడు.
పరుగుల రాణి పీటీ ఉష కూడా నాలుగు సార్లు ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొంది. 1980, 1984, 1988, 1996 ఒలింపిక్స్‌లో పాల్గొని దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చింది.
హైదరాబాదీ గగన్ నారంగ్ కూడా తన కెరీర్‌లో 4 సార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. అతను 2004, 2008, 2012, 2016 ఒలింపిక్స్‌లో ఆడాడు.
రెజ్లర్ సుశీల్ కుమార్ మూడుసార్లు ఒలింపిక్స్‌లో భాగమయ్యాడు. 2004, 2008, 2012 ఒలింపిక్స్‌లో ఆడి 2 పతకాలు సాధించాడు.