Watch Video: ఒడిలో పిల్లాడు ఉన్నా.. ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్.. చప్పట్లతో హోరెత్తిన స్టేడియం.. వైరల్

రాస్ టేలర్ భారీ సిక్స్‌ను మైదానం వెలుపల నిల్చున్న వ్యక్తి అద్భుతంగా పట్టాడు. ఒడిలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నా.. ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్‌ను పట్టుకున్నాడు.

Watch Video: ఒడిలో పిల్లాడు ఉన్నా.. ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్.. చప్పట్లతో హోరెత్తిన స్టేడియం.. వైరల్
Cricket Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Jan 09, 2023 | 11:35 AM

సోషల్ మీడియాలో ఓ క్రికెట్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి మైదానం వెలుపల అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. అందరినీ ఆశ్యర్యపరిచేలా క్యాచ్ పట్టడంతో ఈ వీడియోపై నెటిజన్లు తమ ప్రేమను చూపిస్తూ, తెగ షేర్ చేస్తున్నారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న దేశవాళీ మ్యాచ్‌లో ఈ సీన్ కనిపించింది. న్యూజిలాండ్‌ వెటరన్‌ రాస్‌ టేలర్‌ బంతిని సిక్సర్‌ బాది మైదానం నుంచి బయటకు పంపాడు. ఆ తర్వాత ఓ వ్యక్తి మైదానం వెలుపల నిల్చుని ఉన్నాడు.

బౌండరీ దాటిన బాల్.. అద్బుతమైన క్యాచ్..

రాస్ టేలర్ భారీ సిక్స్‌ను గ్రౌండ్ వెలుపల ఉన్న వ్యక్తి పట్టుకున్నాడు. కానీ, ఆ సమయంలో ఆ వ్యక్తి ఒడిలో ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. కానీ అతను కేవలం ఒక చేత్తో విచిత్రమైన క్యాచ్‌ను పట్టుకున్నాడు. ఆ తర్వాత మైదానంలో ఉన్న ఆటగాళ్లే కాకుండా స్టేడియంలో ఉన్న అభిమానులు కూడా నమ్మలేకపోయారు. ఈ అద్భుతమైన క్యాచ్ పట్టినందుకు.. అంతా చప్పట్లతో ఈ వ్యక్తిని అభినందించారు.

ఇవి కూడా చదవండి

నెజిటన్ల పొగడ్తలు..

అయితే ఈ క్యాచ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రేక్షకులు పట్టుకున్న క్యాచ్‌లలో ఇదొకటి అద్భుతమైనదంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. చేతిలో పిల్లాడు ఉన్నా.. అద్భుతంగా క్యాచ్ పట్టావంటూ మొచ్చుకుంటూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..