AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: అరంగేట్రం చేసిన 5 ఏళ్లకు ఛాన్స్.. ఓపెనర్ల అర్థాన్ని మార్చేసిన ఫైర్ బ్యాట్స్‌మెన్.. ఎవరంటే?

ప్రస్తుతం ప్రతీ జట్టు అద్భుతమైన ఓపెనింగ్ జోడీనిక కోరుకుంటుంది. ఓపెనర్లు రాణిస్తే, మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసేందుకు స్కోప్ ఉంటుంది. అలాగే ఛేజింగ్‌లో ఎతంటి భారీ స్కోరైనా.. ఈజీగా ఛేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది.

Cricket: అరంగేట్రం చేసిన 5 ఏళ్లకు ఛాన్స్.. ఓపెనర్ల అర్థాన్ని మార్చేసిన ఫైర్ బ్యాట్స్‌మెన్.. ఎవరంటే?
sri-lanka-player-romesh-kaluwitharana
Venkata Chari
|

Updated on: Jan 09, 2023 | 11:24 AM

Share

ప్రస్తుతం ప్రతీ జట్టు అద్భుతమైన ఓపెనింగ్ జోడీనిక కోరుకుంటుంది. ఓపెనర్లు రాణిస్తే, మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసేందుకు స్కోప్ ఉంటుంది. అలాగే ఛేజింగ్‌లో ఎతంటి భారీ స్కోరైనా.. ఈజీగా ఛేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే ప్రతీజట్టు సూపర్ ఫాంలో ఉన్న ఓపెనర్లను కోరుకుంటుంది. అలాగే కొత్త బంతిని చితకబాదడం కూడా వారి ముఖ్యమైన పని. ఇలాంటి ఓపెనర్లను ఇప్పటికే చాలామందిని మనం చూశాం. ముఖ్యంగా శ్రీలంక తమ జట్టులో మార్పు చేసి, ఓపెనింగ్ నిర్వచనాన్ని మార్చడానికి పునాది వేసింది. అలాంటి ఆటగాడిని ఓపెనర్‌గా మార్చి సంచలనాలకు తెర తీసింది. ఆ ఆటగాడి పేరు రొమేష్ కలువితార్న.

ఈ రోజున అంటే జనవరి 9, 1996న రొమేష్ మొదటిసారిగా ఓపెనింగ్ చేసి, ఆ తర్వాత బౌలర్లను చిత్తు చేశాడు. అతనిలాంటి ఓపెనర్ కోసం ఇప్పటి వరకు ప్రతి జట్టు వెతుకుతుంది. శ్రీలంక కెప్టెన్ అరవింద డి సిల్వా సనత్ జయసూర్యతో కలిసి తొలిసారి ఓపెనర్‌గా రొమేష్‌ను పంపాడు. ఈ మ్యాచ్‌లో రోమేష్ ఆస్ట్రేలియాపై హాఫ్ సెంచరీ చేశాడు. రొమేష్ తుఫాను బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా అద్భుతమైన వికెట్ కీపర్ కూడా.

అరంగేట్రం చేసిన 5 ఏళ్ల తర్వాత ఓపెనర్ పాత్ర..

రొమేష్ తన మొదటి వన్డేని శ్రీలంక తరపున 8 డిసెంబర్ 1990న భారతదేశంపై ఆడాడు. అయితే అంతకుముందు మిడిల్‌ ఆర్డర్‌, లోయర్‌ ఆర్డర్‌లో ఆడేవారు. 1996లో అతడిని ఓపెనర్‌గా నిలబెట్టి ఆ తర్వాత రొమేష్‌ తన పేరు చెప్పగానే బౌలర్లు వణికిపోయేంతలా పేరుగాంచాడు. ఓపెనర్‌గా తన మొదటి మ్యాచ్‌లో, రోమేష్ ఆస్ట్రేలియాపై 75 బంతుల్లో 77 పరుగులు చేశాడు. అందులో అతను 12 ఫోర్లు సాధించాడు. ఈ సమయంలో అతను 102.66 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. అప్పట్లో ఈ స్ట్రైక్ రేట్ గొప్పదిగా పేరుగాంచింది.

ఇవి కూడా చదవండి

ప్రమాదకరమైన ఓపెనర్‌గా మార్పు..

రొమేష్‌ను ప్రమాదకరమైన ఓపెనర్ అని పిలవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఈ బ్యాట్స్‌మన్ ప్రారంభ ఓవర్లలో బౌలర్లకు చుక్కలు చూపించేవాడు. ఆ సమయంలో 15 ఓవర్ల సర్కిల్ ఉండేది. అంటే 15 ఓవర్లకు ఫీల్డింగ్ జట్టు 30 గజాల సర్కిల్ వెలుపల ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే ఉంచుకోగలదు. మిగిలిన ఆటగాళ్ళు లోపల ఉండేవారు. దీన్ని సద్వినియోగం చేసుకున్న రొమేష్ తొలి ఓవర్లలో బంతిని ఫోర్లు, సిక్సర్ల కోసం సర్కిల్ ఫీల్డర్లపైకి పంపేవాడు. ఇందులో జయసూర్య కూడా బాగా సపోర్ట్ చేశాడు. వాస్తవానికి ఇద్దరూ ఓపెనర్ల నిర్వచనానికి మరోలా అర్ధం చూపించాడు. ఈ జోడీ పేరంటే అలనాటి బౌలర్లకు భయం. నేటికీ ఈ జంట ప్రమాదకరమైన ఓపెనింగ్ జోడీలలో లెక్కించారు.

రొమేష్ తన కెరీర్‌లో 49 టెస్టు మ్యాచ్‌లు ఆడి 26.12 సగటుతో 1933 పరుగులు చేశాడు. అయితే టెస్టులో అతను ఓపెనర్‌గా రాణించలేదు. వన్డేలలో అతను శ్రీలంక తరపున 189 మ్యాచ్‌లు ఆడాడు. 22.22 సగటుతో 3711 పరుగులు చేశాడు. టెస్టుల్లో మూడు సెంచరీలు, వన్డేల్లో రెండు సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో తొమ్మిది హాఫ్ సెంచరీలు, వన్డేల్లో 23 హాఫ్ సెంచరీలు చేశాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..